For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో మార్కెట్లు: 200 పా.యింట్లు దాటిన సెన్సెక్స్, నిఫ్టీ@11,000

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 నిమిషాలకు సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి 36,830 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 10,903 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత మార్కెట్లు కాసేపటికి లాభాలబాట పట్టాయి. 11.00 సమయానికి సెన్సెక్స్ 191.30 (0.52%) లాభపడి 37,173.07 వద్ద, నిఫ్టీ 55.00 (0.50%) లాభపడి 11,001.20 వద్ద ట్రేడ్ అయింది. కాసేపటికి సెన్సెక్స్ 225 పాయింట్లు, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడింది. ఇక, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.70గా ఉంది.

ఉదయం ఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1.65 శాతం, టెక్ మహీంద్రా షేర్లు 1.25 శాతం, మైండ్ ట్రీ షేర్లు 0.90 శాతం, ఇన్ఫోసిస్ షేర్లు 0.90 శాతం నష్టపోయాయి. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్టువేర్ 0.54 శాతం, టాటా కన్సల్టెన్సీ షేర్లు 0.37 శాతం, ఇన్ఫీబీమ్ అవెన్యూస్ షేర్లు 0.25 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

రూ.100 డిపాజిట్‌కు 50ఛార్జ్! అక్టోబర్1 నుంచి SBI కొత్తరూల్స్రూ.100 డిపాజిట్‌కు 50ఛార్జ్! అక్టోబర్1 నుంచి SBI కొత్తరూల్స్

Market Update: Sensex rebounds 220 pts, Nifty flirts with 11,000 mark

ఎన్ఎస్ఈలో యస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఈక్విటీస్ హోల్డింగ్స్, అశోక్ లేలాండ్, జేఎస్‌పీఎల్, వొడాఫోన్ ఐడియా, ఎన్బీసీసీ, సెయిల్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఫైనాన్సియల్ సర్వీస్ రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

English summary

లాభాల్లో మార్కెట్లు: 200 పా.యింట్లు దాటిన సెన్సెక్స్, నిఫ్టీ@11,000 | Market Update: Sensex rebounds 220 pts, Nifty flirts with 11,000 mark

Sectoral trend was mixed with Bank, FMCG, Pharma and Financial Service trading in green.
Story first published: Monday, September 9, 2019, 11:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X