For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గత వారం కంటే రూ.1300 తగ్గిన బంగారం ధరలు

|

బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఎంసీఎక్స్‌లో బంగారం 0.7 శాతం పడిపోయి రూ.38,527గా ఉంది. గత వారం రూ.39,885 అత్యధికంగా పలికింది. అప్పటి నుంచి ఏకంగా రూ.1,300 తగ్గింది. ఎంసీఎక్స్‌లో వెండి 0.51 శాతం పడిపోయి కిలో 47,640గా ఉంది. ఇటీవల వెండి ధర జీవనకాల గరిష్టం రూ.51,489 వద్ద నిలిచిన అనంతరం భారీగా తగ్గుతోంది.

స్విస్ బ్యాంక్ నుంచి తొలి జాబితా, దాచిన సంపద బట్టబయలు!స్విస్ బ్యాంక్ నుంచి తొలి జాబితా, దాచిన సంపద బట్టబయలు!

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం 0.2 శాతం పడిపోయి ఔన్సుకు 1,509.81 డాలర్లుగా ఉంది. ఔన్స్ సిల్వర్ 0.6 శాతం పడిపోయి 18.04 డాలర్లుగా ఉంది. అమెరికా - చైనా ట్రేడ్ వార్ టాక్స్ సానుకూలంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం వంటి తదితర కారణాలతో బంగారం, వెండి ధరల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం లేదు.

హైదరాబాదులో...

హైదరాబాదులో...

హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.36,720 వద్ద ఉంది. అయితే ఆ తర్వాత తగ్గుదల కనిపించింది. హైదరాబాదులో మధ్యాహ్నం సమయానికి బంగారం ధర మరింత తగ్గి రూ.39,530గా ఉంది.

వివిధ నగరాల్లో...

వివిధ నగరాల్లో...

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,590, 24 క్యారెట్ బంగారం ధర రూ.39,910గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు.. 24 క్యారెట్లు వరుసగా.. రూ.37,390, రూ.38,390, ఢిల్లీలో రూ.37,400, 24 క్యారెట్లు రూ.38,600, కోల్‌కతాలో రూ.37,680, 38,860, బెంగళూరులో రూ.35,900, రూ.39,160, హైదరాబాదులో రూ.36,590, రూ.39,910, విజయవాడలో రూ,.36,590, రూ.39,910గా ఉంది.

English summary

గత వారం కంటే రూ.1300 తగ్గిన బంగారం ధరలు | Gold prices today down Rs.1,300 from highs, silver rates continue to tumble

Gold prices today edged lower in India while silver rates continued to tumble. On MCX, October gold futures were trading 0.07% lower at ₹38,527, down over ₹1,300 from last week's highs of ₹39,885.
Story first published: Monday, September 9, 2019, 14:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X