For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సగం నష్టాలు తగ్గాయి.. కోరుకున్న నెలలో లాభాల్లోకి జొమాటో కానీ..!

|

న్యూఢిల్లీ: భారతదేశంలోని అతిపెద్ద ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో లాభాల వైపు పయనిస్తోంది. ఇది కొత్త నగరాలకు కూడా విస్తరిస్తూ వేలాది ఉద్యోగాలను సృష్టిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటోంది. ఎస్టాబ్లిష్ట్ ఔట్‌లెట్స్, డార్క్ కిచెన్స్‌తో లాభదాయకం వైపు పరుగెడుతోందని జొమాటో ఫౌండర్ అండ్ సీఈవో దీపీందర్ గోయల్ అన్నాడు. ఈ కంపెనీ శనివారం నాడు 540 మంది ఉద్యోగాలను తొలగించింది. గురుగ్రామ్‌లోని హెడ్ ఆఫీస్‌లో పని చేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన వారిని తొలగించింది. కానీ గోయల్ మాత్రం తాము ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెబుతున్నారు.

SBI ఖాతాదారులకు షాక్, RDపై తగ్గిన వడ్డీ రేట్లు ఇలా...SBI ఖాతాదారులకు షాక్, RDపై తగ్గిన వడ్డీ రేట్లు ఇలా...

500 నగరాల్లోని 25 మిలియన్ల కస్టమర్లకు సేవలు

500 నగరాల్లోని 25 మిలియన్ల కస్టమర్లకు సేవలు

2008లో స్కానింగ్ చేసి రెస్టారెంట్ మెనూను ఆన్‌లైన్‌లో పెట్టడం ప్రారంభించామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు జొమాటో 24 దేశాల్లోని 10,000 నగరాల్లో సేవలు అందిస్తోందని దీపీందర్ గోయల్ చెప్పాడు. భారత్‌లో 500 నగరాల్లోని 25 మిలియన్ల కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాల్యూ 3.6 బిలియన్ డాలర్ల నుంచి 4.5 బిలియన్ డాలర్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒక్క రెస్టారెంట్ బయటకు పోలేదు...

ఒక్క రెస్టారెంట్ బయటకు పోలేదు...

ఈ కంపెనీకి సిలికాన్ వ్యాలీ వెంచర్ ఫండ్ సికోయా కాపిటల్స్, సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమ్‌సెక్ హోల్డింగ్స్, భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఇన్ఫో ఎడ్జ్ నిధులు సమకూర్చాయి. దీపిందర్ గోయల్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 2,50,000 రెస్టారెంట్లు, వందలాది డార్క్ కిచెన్స్ ద్వారా ఆర్డర్స్ నిర్వహిస్తున్నామని, తమ వద్ద నుంచి ఒక్క రెస్టారెంట్ కూడా బయటకు వెళ్లలేదని చెప్పారు.

బిజినెస్‌లో 50 శాతం నష్టాలు తగ్గాయి..

బిజినెస్‌లో 50 శాతం నష్టాలు తగ్గాయి..

వ్యాపారంలోని లాభ నష్టాల గురించి మాట్లాడుతూ... గత మూడు నెలలుగా తమకు బిజినెస్‌లో 50 శాతం నష్టాలు తగ్గినట్లు దీపిందర్ గోయల్ చెప్పారు. గత ఏడాది ఆరు రెట్లు తమ వ్యాపార వృద్ధి పెరిగిందని, తాము ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 500కు పైగా నగరాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు మేం కోరుకుంటే ఏ నెలలోనైనా లాభాలు వస్తాయని, కానీ ప్రస్తుతం తాము వ్యాపార వృద్ధిపై దృష్టి పెట్టామని చెప్పారు.

అయిదేళ్లలో 10 రెట్ల వృద్ధి

అయిదేళ్లలో 10 రెట్ల వృద్ధి

ప్రతి వారం 25 మిలియన్ల కస్టమర్లు ఆర్డర్ చేస్తారని, 0.5 మిలియన్ల ఉద్యోగాలను నేరుగా సృష్టిస్తామని, రానున్న అయిదేళ్లలో 10 రెట్ల వృద్ధిని సాధిస్తామని దీపిందర్ గోయల్ చెప్పారు. చాలా కంపెనీలకు రెస్టారెంట్స్‌తో పాటు డార్క్ కిచెన్స్ వంటి ఓన్ డెలివరీ సర్వీసులు లేవని, అలా జొమాటో మాత్రమే ఉద్యోగాలు సృష్టిస్తోందన్నారు.

తొలిసారి రూ.200 కోట్లు దాటింది

తొలిసారి రూ.200 కోట్లు దాటింది

తమ డెలివరీ పార్ట్‌నర్స్ నెలవారీ ఆదాయం తొలిసారి రూ.200 కోట్లు దాటిందని, డెలివరీ భాగస్వాముల సంఖ్య 2.3 లక్షలకు ఈ నెల పెరిగిందని, అంతకుముందు ఏడాది ఇది 74,000గా మాత్రమే ఉందని గురువారం దీపీందర్ ట్వీట్ చేశారు. కానీ శనివారం పలువురు ఉద్యోగులను జొమాటో తొలగించింది. ఉద్యోగుల తొలగింపు అనంతరం జొమాటోలో 5,000 మంది ఉంటారని అంచనా. (అంతర్జాతీయ మార్కెట్ సహా).

1000 నగరాలపై దృష్టి...

1000 నగరాలపై దృష్టి...

ప్రస్తుతం జొమాటో 1000 నగరాలకు చేరే అంశంపై దృష్టి సారించింది. టయర్ 3, టయర్ 4 నగరాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉంది. ఇటీవల అలప్పుజ, మలప్పురం (Kerala), పుష్కర్ (Rajasthan), అంక్లేశ్వర్, మెహ్సానా (Gujarat), కన్యాకుమారి, కొడైకెనాల్, కడలూర్, (Tamil Nadu), ఇటార్సి, అశోక్ నగర్ (Madhya Pradesh), ఫాజికా, నవాన్షర్ (Punjab), వృందావన్, అజమ్‌గర్ (Uttar Pradesh), సిల్వస్సా (Daman), చిత్తూరు (Andhra Pradesh), డాల్టోన్ గంజ్ (Jharkhand), పటౌడీ (Haryana), ఉస్మానాబాద్, సావంత్‌వాడి (Maharashtra), షిల్లాంగ్ (Meghalaya)లలో విస్తరించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఇది 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అంతకుముందు ఏడాది ఇది 80 మిలియన్ డాలర్లు. ఆర్థిక సంవత్సరంలో నష్టాలు 294 మిలియన్ డాలర్లుగా ఉంది.

English summary

సగం నష్టాలు తగ్గాయి.. కోరుకున్న నెలలో లాభాల్లోకి జొమాటో కానీ..! | Zomato headed for profitability; sees 10x growth in 5 years creating thousands of jobs

India's largest restaurant search and food delivery platform Zomato is on the verge of cracking its maiden profits on the back of rapid expansion into newer cities that has brought more business to both established outlets and 'dark kitchens', creating thousands of jobs, its founder and CEO Deepinder Goyal said.
Story first published: Sunday, September 8, 2019, 18:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X