For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నగదు రూపంలో ఇచ్చే కార్పోరేట్ చందాలపై జీఎస్టీ

|

ముంబై: పెద్ద కంపెనీలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సుబులుటీస్ (CSR) కోసం ఖర్చు చేయడాన్ని ఇప్పుడు తప్పనిసరి చేశారు. ఇలా పెద్ద కంపెనీలు సామాజిక బాధ్యతగా ఖర్చు పెట్టే ఈ నిధులపై కూడా జీఎస్టీ విధిస్తున్నారు. ఇలా జీఎస్టీ విధించడాన్ని కంపెనీలు తప్పుబడుతున్నాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నగదు చందాలతో పాటు చెక్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్స్ కూడా జీఎస్టీ కిందకు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా సరుకుల సరఫరా లేదా సేవలు వంటి వాణిజ్య అంశాలను మాత్రమే జీఎస్టీ కిందకు తీసుకు వస్తామని, చందాలు ఇవ్వడం వల్ల సంస్థలకు ఎలాంటి ప్రతిఫలం ఉండదని, ఈ విషయాన్ని 2010లో విడుదల చేసిన ఓ సర్వీస్ ట్యాక్స్ సర్క్యులర్‌లో కూడా పేర్కొన్నారని, నగదు చందాలు కూడా జీఎస్టీ పరిధిలోకి రావని, ఒకవేళ ఏదైనా లబ్ధి ఉంటే అప్పుడు మాత్రమే జీఎస్టీ పరిధిలోకి వస్తుందని ఈవై ఇండియా ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ భాగస్వామి సంఘ్వీ అన్నారు.

మీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్‌కు ఏదో ఒకటిమీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్‌కు ఏదో ఒకటి

Cash CSR donations face GST implications

కొద్ది రోజుల క్రితం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్‌కు సంబంధించిన కేసులో ఢిల్లీ బెంచ్ ఇచ్చిన రూలింగ్ ఈ చర్యకు తెరతీసింది. ఏవైనా పనులు చేపట్టాలి అంతేకానీ నగదు రూపంలో ఇవ్వవద్దని, అలా చేస్తే అది జీఎస్టీ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. దీంతో నగదు చందాలు కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చే అంశంపై చర్చ ప్రారంభమైంది.

English summary

నగదు రూపంలో ఇచ్చే కార్పోరేట్ చందాలపై జీఎస్టీ | Cash CSR donations face GST implications

Corporate social responsibility (CSR) for large companies has now become mandatory. Yet, unfortunately, GST laws do not address the taxability of goods or services provided by companies as part of their CSR activities.
Story first published: Sunday, September 8, 2019, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X