మన దేశ డిజిటల్ పేమెంట్ ప్లాటుఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీన్ని వివిధ రకాల డిజిటల్ చెల్లింపుల కోసం విపరీతంగా వాడుతున్నారు. అనేక రకాల చెల్లింపుల అప్లికేషన్లు యూపీఐ ఆధారితంగా లావాదేవీలు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నాయి. అంతే కాకుండా మంచి ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. మూడేళ్ళ కాలంలోనే దీని ద్వారా 1,000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 17 పైగా ఉండటం గమనార్హం. యూపీఐ ని 2016 సంవత్సరంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి 2019 వరకు అంటే 37 నెలల్లో 1,029.44 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ మొత్తం లావాదేవీల్లో దాదాపు 80 శాతం లావాదేవీలు 2018 సెప్టెంబర్ నుంచి 2019 ఆగష్టు వరకు జరిగాయి. ఇదేకాలంలో జరిగిన 819.03 కోట్ల లావాదేవీల విలువ రూ.14.11 లక్షల కోట్లుగా ఉంది.

నోట్ల రద్దు తరవాత...
* పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత యూపీఐ మూలంగా డిజిటల్ లావాదేవీలు జోరుగా పెరిగే అవకాశం ఏర్పడింది.
* 2016 డిసెంబర్ లో మొదటిసారి డిజిటల్ లావాదేవీలు 19 లక్షల మార్కును దాటాయి. అప్పటి నుంచి నెలవారీ లావాదేవీలు మూడు లక్షల కన్నా తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి.
* యూపీఐ ప్లాట్ ఫామ్ పై భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) అప్ ను కూడా ఎన్ పీసిఐ విడుదల చేసింది.
* అయితే భీమ్ కు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల్లో భీమ్ వాటా 2017 జనవరిలో 41.36 శాతం ఉంటే 2019 ఆగష్టు నాటికీ 1.82 శాతానికి తగ్గిపోయింది. ఇదేకాలంలో లావాదేవీల విలువ 21.49 శాతం నుంచి 3.96 శాతానికి చేరుకుంది.

ఈ కంపెనీలదే జోరు..
* యూపీఐ లావాదేవీల్లో పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి కంపెనీలు దూసుకుపోతున్నాయి.
* మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఇవి ప్రాసెస్ చేసిన లావాదేవీల వాటాయే 90 శాతానికి పైగా ఉండటం విశేషం.
* లావాదేవీల పరిమాణం, లావాదేవీల మొత్తం విషయంలో గూగుల్ పే ముందంజలో ఉంటోంది.

క్యూఆర్ కోడ్ తో...
* మొబైల్ అప్ ద్వారా చెల్లింపుల సదుపాయం కల్పిస్తున్న కంపెనీలు క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా లావాదేవీలు నిర్వహించే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి.
* ఈ సదుపాయం అటు వ్యాపారస్తులకు, ఇటు వినియోగదారులకు సౌకర్యంగా ఉంటోంది.
* కార్డుల ద్వారా చెల్లింపులను అనుమతించాలంటే వ్యాపారస్తులు పాయింట్ అఫ్ సేల్ మిషన్ లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఎలాంటి మిషన్ అవసరం ఉండదు. క్యూ ఆర్ కోడ్ ను ప్రింట్ తీసుకొని తమ దుకాణం ముందుంచితే చాలు కొనుగోలు దారులు ఆ కోడ్ ను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు.


Click it and Unblock the Notifications