జేబులు ఖాళీ... కొనే వారేరి?

మార్కెట్లో ఏ వస్తువు ధర చూసినా భగ్గుమంటోంది. కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. అందుకే తప్పని సరి అయితేనే వస్తువులను కొనుగోలు చేయడానికి జనం ముందుకువస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మకాలు బాగా తగ్గిపోతున్నాయి. దీంతో కంపెనీలు తలపట్టుకుంటున్నాయి. అమ్మకాలు పెంచుకునే మార్గంకోసం తల బాదుకుంటున్నాయి. కస్టమర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి కంపెనీలు. పెద్ద ఎత్తున తమ ఉత్పత్తులకు సంబంధించి పత్రికలూ, టీవీల్లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాయి. అయినప్పటికి కస్టమర్ల మనసు కరగడం లేదు. అవసరాన్ని బట్టి మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారు తప్ప అనవసర కొనుగోళ్ల జోలికి వెళ్లడం లేదు.

పెరుగుతున్న ధరలు...

పెరుగుతున్న ధరలు...

* చాకోలెట్, బిస్కెట్ నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వాహనాలు తదితరాల దాలన్నీ పెరుగుతూనే ఉన్నాయి.

* మరోవైపు ఇంధనాల ధరలు, వడ్డీ రేట్లు భారంగా మారాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల రోజువారీగా సామాన్యులపై భారం పడుతూనే ఉంది. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో నెలవారీ బడ్జెట్ కట్టు తప్పుతోంది.

* ఖర్చులు పెరుగుతున్నాయి... కానీ ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదు. ఖర్చులు పోగా మిగిలే సొమ్ము తక్కువగా ఉంటోంది. ఇందులో భవిష్యత్ అవసరాలకోసం దాచుకోగా చాలా తక్కువ సొమ్ము మాత్రమే ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉంటోంది. దీన్ని ఆచితూచి ఖర్చుపెడుతున్నారు జనం.

* అన్నింటి ధరలు పెరగడం వల్ల నెల చివరి వరకు జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంటోంది.

ఫోన్ల కోసం ఎక్కువ ఖర్చు..

ఫోన్ల కోసం ఎక్కువ ఖర్చు..

* ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ కనిపిస్తోంది. ఇంట్లోని ప్రతి ఒక్కరికీ ఒక మొబైల్ ఫోన్ ఉంటోంది. తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఫోన్లకు ఖర్చు చేసే వారు ఎక్కువ ఉంటున్నారు.

* ఫోన్ లేనిదే రోజు గడిచే పరిస్థితి లేదు. ఇక ఈ ఫోన్లను తరచూ మారుస్తున్నవారు కూడా ఉన్నారు. వీటికోసం అధిక మొత్తం చెల్లిస్తున్నారు.

* మొబైల్ డేటా కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. కుటుంబంలోని వారందరు కూడా పరిమిత కాల్స్, డేటా కోసం రీఛార్జ్ చేస్తుండటం వల్ల మొబైల్ బిల్లులు పెరుగుతున్నాయి.

ద్విచక్ర వాహనాలు, కార్లు ప్రియం..

ద్విచక్ర వాహనాలు, కార్లు ప్రియం..

* ముడిసరుకుల ధరలు పెరిగిపోతున్నాయని టూవీలర్, కార్ల కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పుడు అమ్మకాలు తగ్గిపోయాయని గగ్గోలు పెడుతున్నాయి. ఓవైపు అధిక ధరలు మరోవైపు అధిక వడ్డీ రేట్లు, ఇంధన ధరలు. ఇలాంటి పరిస్థితుల్లో కార్లు, కొత్త బైకులు కొనుగోలు చేయడం ఎందుకని చాలా మంది భావిస్తున్నారు.

* ధరలను పెంచిన కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి. అయినప్పటికి షోరూములలో కస్టమర్ల హడావిడి అంతగా కనిపించడం లేదట.

* వాహనాలపై అధిక వస్తుసేవల పన్ను వసూలు చేస్తున్నారు. బీమా ప్రీమియం లు కూడా బాగా పెరిగిపోయాయి. అందుకే వాహనదారులు కొత్త వాహనాల జోలికి వెళ్లడం లేదు.

పండగల సీజన్ పై ఆశలు

పండగల సీజన్ పై ఆశలు

* అన్ని రంగాల్లోని కంపెనీలు వచ్చే పండగల సీజన్లో అమ్మకాలు బాగుంటాయన్న ఆశతో ఉన్నాయి.

* కనీసం పండగల ప్పుడన్నా కొనకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

* ఈ- కామర్స్ కంపెనీలు కూడా మంచి ఆఫర్లతో సిద్ధం అవుతున్నాయి. చూడాలి మరి పండగా సీజన్లో అమ్మకాలు ఎలా ఉంటాయో.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+