ఇన్సూరెన్సుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.. దీనికి అదే కారణం

బీమా తీసుకోవాలన్న నిర్ణయాన్ని చాలా మంది వాయిదా వేస్తుంటారు. రేపు మాపు అనుకుంటూ నెలలు గడిపేస్తుంటారు. కొంత మంది ఏళ్లుగా వాహనాలకు బీమా లేకుండా నడిపేస్తుంటారు. ఇలాంటి వారిలో టూ వీలర్ వాహనదారులు ఎక్కువ మంది ఉంటారు. బీమా ప్రాధాన్యం గురించి తెలిసినప్పటికీ చాలా మంది బీమా తీసుకోవడానికి ముందుకు రారు. బీమా లేకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఆ మొత్తం తక్కువగా ఉండటం వల్ల పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఈ నెల ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ వాహన చట్టంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాలను భారీగా పెంచారు. దీని దెబ్బతో వాహనదారులు బీమా తీసుకోవడానికి పరుగులు తీస్తున్నారు.

బీమా తీసుకుంటే

బీమా తీసుకుంటే

బీమా లేకపోవడం వల్ల జరిమానాలు చెల్లించడం కన్నా బీమా తీసుకుంటే ఏడాది పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చుకదా అని చాలా మంది వాహనదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా వాహన బీమా అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. అంతే కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ఇతర జరిమాణాలనుంచి కూడా తప్పించుకోవచ్చని భావిస్తున్నారు చాలామంది.

అమ్మకాలు డబుల్

అమ్మకాలు డబుల్

* బీమా లేకుండా వాహనాన్ని నడిపినప్పుడు మొదటి సారి పట్టుబడితే విధించే జరిమానాను రూ. 1,000 నుంచి రూ.2,000కు పెంచిన విషయం తెలిసిందే. రెండోసారి పట్టుబడితే రూ.4,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

* ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆన్ లైన్ లో ఆటో ఇన్సూరెన్సు పాలసీల అమ్మకాలు రెండింతలకు పైగా పెరిగాయని బీమా వెబ్ అగ్రిగేటర్ పాలసీ బజార్ వెల్లడించింది.

* గత మూడు రోజుల్లో విక్రయించిన పాలసీల్లో 90 శాతం పాలసీలు కాలం చెల్లిన తర్వాత తీసుకున్నవేనట.

* టూ వీలర్, ఫోర్ వీలర్ బీమా పాలసీల జారీ రెండింతలకుపైగా పెరిగిందట.

* తమ ప్లాట్ ఫామ్ పై రోజుకు దాదాపు 30,000 మోటార్ బీమా పాలసీలను విక్రయించేవాళ్లమని, సవరించిన కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రోజువారీగా విక్రయించే పాలసీలు రెండింతలకు పైగా పెరిగాయని పాలసీ బజార్ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (జనరల్ ఇన్సురెన్సు) తరుణ్ మాథుర్ చెబుతున్నారు. కాలం చెల్లిన మోటార్ ఇన్సూరెన్సు ప్లాన్లే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

బీమా ఉన్న వాహనాలు చాలా తక్కువ

బీమా ఉన్న వాహనాలు చాలా తక్కువ

* ఒక అంచనా ప్రకారం మన దేశంలోని రోడ్లపై 19 కోట్ల వరకు రిజిస్టర్ అయిన వాహనాలు ఉన్నాయి. వీటిలో కేవలం 8.26 కోట్ల వాహనాలకు మాత్రమే బీమా ఉన్నట్టు తెలుస్తోంది.

* వాహనం కొనుగోలు చేసినప్పుడు తప్పని సరిగా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత చాలా మంది బీమా కాలపరిమితి ముగిసిన తర్వాత రెన్యూవల్ చేయడం లేదు.

* టూ వీలర్ల విషయానికి వస్తే ఇది 70 శాతంగా, ఫోర్ వీలర్ల విషయానికి వస్తే 30 శాతంగా ఉంది.

* కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వాహనదారుల్లో చాలా మార్పులు వచ్చినట్టు పరిశీలకులు చెబుతున్నారు.

* హెల్మెట్ లేకున్నా, సీట్ బెల్ట్ ధరించకపోయినా, వేగంగా వాహనాన్ని నడిపినా, రెడ్ సిగ్నల్ ను జంప్చేసినా , బీమా లేకున్నా, ఓవర్ లోడ్ తో వాహనాలను నడిపినా భారీగా జరిమానాలు విధిస్తున్నారు.

* వీటిని చెల్లించడం కన్నా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే చాలు కదా అని వాహనదారులు భావిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+