భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: సెన్సెక్స్ 337, నిఫ్టీ 98 పాయింట్లు హై
ముంబై: భారత మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 337 పాయింట్లు లాభపడి 36,981 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 10,946 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.66 పైసలుగా ఉంది. ఈ రోజు ఉదయం నుంచే మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మార్కెట్లు తళతళలాడాయి. చివరి వరకు అదే ఉత్సాహం కనబరిచాయి.
ఉదయం ఇలా...
భారత మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం గం.9.40 నిమిషాలకు సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి 36,845 వద్ద ఉండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 10,900 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.11.07 నిమిషాలకు సెన్సెక్స్ 178.19 (0.49%) పెరిగి 36,822.61, నిఫ్టీ 48.80 (0.45%) పాయింట్లు లాభపడి 10,896.70 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.00 వద్ద ఉంది.

యస్ బ్యాంకు, టాటా మోటార్స్, డిష్ టీవీ ఇండియా, వొడాఫోన్ ఐడియా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్, డీఎల్ఎఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జేఎస్‌పీఎల్, అశోక్ లేలాండ్, పీఎన్‌బీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫార్మా, లోహ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు నష్టాలను చవి చూస్తున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలను బ్రేక్ పడింది. అమెరికా - చైనాల మధ్య ట్రేడ్ వార్ సమసిపోయేందుకు ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు అక్టోబర్ నెలలో జరుగుతాయనే వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేశాయి. దాదాపు అన్ని రంగాల షోర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది.


Click it and Unblock the Notifications