ప్రపంచ వ్యాప్తంగా సహజ వాయు ధరలు దిగి వచ్చిన నేపథ్యంలో ... ఇండియా లో గ్యాస్ కొనుగోలుదారుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెతుకులాట ప్రారంభించింది. ఆంధ్ర ప్రదేశ్లోని కేజీ -డీ 6 క్షేత్రం లో రిలయన్స్ ఇండస్ట్రీస్ , బ్రిటిష్ పెట్రోలియం (బీపీ ) సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాయి. ఇందుకోసం రెండు కంపెనీలు 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ 35,000 కోట్లు ) పెట్టుబడి పెట్టాయి. ఇరు సంస్థలు కేజీ -డీ 6 లోని మూడు ప్రత్యేక ఫీల్డ్స్ లో సహజ వాయు ను వెలికి తీస్తాయి. వీటికి ఆర్ - క్లస్టర్, సాతేల్లిటస్, ఎంజే గా పేర్లు ఖరారు చేసారు. తొలుత ఆర్ - క్లస్టర్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఇది వచ్చే ఏడాది (2020) ఏప్రిల్ - జూన్ మధ్యలో అందుబాటులోకి రానున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. రోజుకు సుమారు 5 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయు ఉత్పత్తి చేస్తారు.

మూడేళ్ళ 1 బిలియన్ క్యూబిక్ ఫీట్ల ఉత్పత్తి ...
కేజీ బేసిన్ లోని మూడు క్షేత్రాల నుంచి వచ్చే మూడేళ్ళలో భారీగా సహజ వాయు ను ఉత్పత్తి చేయనున్నారు. 2022 నాటికీ పూర్తి కానుందని భావిస్తున్న ఈ కెప్టెన్సీ నుంచి రోజుకు దాదాపు 1 బిలియన్ క్యూబిక్ ఫీట్ల మేరకు సహజ వాయు లభిస్తుంది. దీంతో రోజుకు అమెరికాలోని గృహాలన్నిటికీ ప్రతి రోజూ సరిపోయేంత గ్యాస్ ను అందించా వచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. అదే భారత దేశంలో అయితే, కనీసం 10 కోట్ల గృహాలకు గ్యాస్ ను ప్రతి రోజూ సరఫరా చేయ వచ్చని అంచనా వేస్తున్నారు.

ఆక్షన్ ప్రారంభం...
అయితే, ఈ గ్యాస్ ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలు ఆక్షన్ ప్రక్రియను ప్రారంభించాయి. అక్టోబర్ 10 వరకు బిడ్డింగ్ వేసేందుకు కొనుగోలు దారులను అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ఆక్షన్ ప్రక్రియను నిర్వహించేందుకు క్రిసిల్ రిస్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోలుషన్స్ అనే సంస్థను నియమించాయి. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. బ్రెంట్ ఆయిల్ ధరల తో ఆక్షన్ బిడ్డింగ్ కు లింక్ చేశారు. బిడ్డెర్లు నిర్ణీత బ్రెంట్ ఆయిల్ ధరల కంటే 9% కంటే తక్కువకు కోట్ చేయరాదని నిబంధన విధించారు. గురువారం నాటికీ బ్రెంట్ ఆయిల్ ధర బారెల్ కు 60. 71 డాలర్లు గా ఉంది. దీంతో ఫ్లోర్ ధరను ప్రతి MMBTU (మెట్రిక్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) కు 5.46 డాలర్లు గా నిర్ణయించారు.

తగ్గిన గ్యాస్ ధరలు...
ఇదిలా ఉంటె, ప్రపంచ వ్యాప్తంగా లిక్విఫీడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ ఎం జీ ) ధరలు భారీగా పతనం అయ్యాయి. ఇదే విషయం ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ పెట్రోలియం ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ మార్కెట్ లో ఎల్ ఎం జీ ధరలు MMBTU కు కేవలం 4 డాలర్లు పలుకుతున్నాయి. అంటే, రిలయన్స్ నిర్ణయించిన ధరకంటే ప్రతి MMBTU కు 1.5 డాలర్ల మేరకు తక్కువకు గ్యాస్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ గ్యాస్ ఆక్షన్ కు ఈ మేరకు స్పందన లభిస్తుందో చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గ్యాస్ మంచిదే...
అయితే, మన దేశం లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఈ తేడా స్పష్టంగా చూడ వచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలు, CNG , LNG ఆధారితంగా పనిచేసే వాహనాలకు ప్రాధాన్యం లభిస్తోంది. పన్నులు కూడా వీటికి తక్కువ. పైగా బ్యాంకు రుణాలు తీసుకొంటే వ్యక్తిగత ఆదయ పన్నులో మినహాయింపులు కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో రిలయన్స్ LNG అందుబాటులోకి వస్తే ... అటు వాహనాలు, ఇటు గృహాలకు స్వచ్ఛమైన ఇంధనాన్ని సరఫరా చేయవచ్చు. దీంతో పర్యావరణానికి కొంత మేలు చేసిన వరం అవుతామని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications