భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఒకటైన స్విగ్గీ మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. బుధవారం స్విగ్గీ గో (Swiggy Go) సేవలను ప్రారంభించంది. ఇందులో పికప్ అండ్ డ్రాప్ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. వచ్చే సంవత్సరం నాటికి 300 నగరాల్లో ఈ సర్వీస్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బెంగళూరులో లాంచ్ చేసింది. దీని ద్వారా ఏ సేవలనైనా పొందవచ్చు. బెంగళూరులో ఎక్కడికైనా ఏమైనా పంపించాలనుకున్నా, ఇవ్వాలనుకున్నా వస్తువులను స్విగ్గీ ద్వారా బుక్ చేసుకొని పంపించవచ్చు.

పికప్, డ్రాప్
ఏ వస్తువులనైనా పికప్, డ్రాప్ చేసుకోవడానికి స్విగ్గీ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు లాండ్రీకి దుస్తులు ఇవ్వడం, తీసుకు రావడం, ఇంట్లో లంచ్ బాక్సును ఆఫీస్‌కు తీసుకు వెళ్లడం, పిల్లలకు లంచ్ బాక్స్ తీసుకు వెళ్లడం, ఆఫీసు పత్రాలు, ఇతర డాక్యుమెంట్స్ మరోచోటుకు పంపించడం, పార్సిల్ డెలివరీ వంటి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చింది.

హైదరాబాదుకూ విస్తరణ
పూలు, మెడిసిన్స్ వంటి కొన్ని వస్తువులను కేవలం గంటలోపే డోర్ డెలివరీ చేస్తుంది. స్విగ్గీ ప్రధాన యాప్‌లో భాగంగానే 'స్విగ్గీ గో' పని చేస్తుంది. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలనుకున్నా స్విగ్గీ గో ద్వారా బుక్ చేసుకుంటే చాలు. బెంగళూరుతో పాటు హైదరాబాదులోని ఈ సేవలు విస్తరించనున్నారు.

మూవింగ్ లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా
నేటి ఫాస్ట్ మూవింగ్ లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా తాము తీసుకువచ్చిన ఈ యాప్ అందరికీ ఉపయోగపడుతుందని, చిన్న వ్యాపారాలను వడిపే వ్యక్తులకు, తరుచూ బట్వాడా చేయాల్సిన బాధలు తప్పుతాయని స్విగ్గీ తన ప్రకటనలో పేర్కొంది. బేక్డ్ గూడ్స్ నుంచి డాక్యుమెంట్లు, లాండ్రీ, హాండ్‌మేడ్.. ఇలా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

స్విగ్గీ గో లాంచ్
ప్రస్తుతం బెంగళూరులో 'స్విగ్గీ గో'ను లాంచ్ చేసింది. 2020 నాటికే 300 నగరాలకు విస్తరింపచేసే ప్లాన్ చేస్తోంది. బెంగళూరు, హైదరాబాదుల్లో స్విగ్గీ స్టోర్స్ విస్తరణ ఉంటుందని తెలిపింది. అన్ని సౌకర్యాలు కల్పించడం ద్వారా పట్టణ వినియోగదారుల జీవన ప్రమాణాలను పెంచడమే స్విగ్గీ విజన్ అని స్విగ్గీ సీఈవో శ్రీహర్ష మాజెట్టీ తెలిపారు.

డెలివరీ బాయ్స్‌కు అదనపు ఆదాయం
ఆహారంతో పాటు ఏ వస్తువునైనా డెలీవరీ చేసేందుకు స్విగ్గీ సిద్ధంగా ఉంటుందని, ఈ సేవలు అందించడంలో స్విగ్గీనే మొదటిదని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా డెలివరీ బాయ్స్‌కు అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. 2014లో మొదలైన స్విగ్గీ 325 పట్టణాల్లో లక్షా 30వేల రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం ఫుడ్ కాకుండా అవసరమైన అన్నింటిని డెలివరీ చేస్తున్న అగ్రిగేటర్లలో స్విగ్గీనే మొదటిదని, బెంగళూరు నగరం తొలిసారి లాంచ్ చేస్తున్నామన్నారు.

బెంగళూరు, హైదరాబాదుల్లో వీటితో జత
స్విగ్గీతో బెంగళూరులో ఇప్పటికే 300 మంది వ్యాపారస్తులు జత కట్టారు. ఇందులో గోద్రేజ్ నేచర్ బాస్కెట్, నీలగిరీస్, ఆర్గానిక్ వరల్డ్, హెడ్స్ ఆఫ్, టెయిల్స్ అండ్ నందూస్ చికెన్ వంటి సంస్థలు ఉన్నాయి. హైదరాబాదులో 200 సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఇందులో రత్నదీప్, ఘనశ్యామ్, స్నేహ చికెన్, ఎల్లో అండ్ గ్రీన్, 24 ఆర్గానిక్ మంత్ర వంటి సంస్థలు ఉన్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications