ఆకర్షణీయమైన ఆఫర్లతో మరో క్రెడిట్ కార్డు అందుబాటులోకి వచ్చింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు 'డిజిస్మార్ట్' పేరుతో క్రెడిట్ కార్డును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కార్డు ద్వారా భాగస్వామ్య సంస్థల వద్ద జరిపే డిజిటల్ లావాదేవీలపై ఆకర్షణీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం వినియోగదారులకు లభించనుంది. మిల్లీనియల్స్ ను దృష్టిలో ఉంచుకొని బ్యాంక్ ఈ కార్డును అందుబాటులోకి తెచ్చింది. ట్రావెల్, ఎంటర్టైన్మెంట్, ఫాషన్, గోసరీస్, ఫుడ్ డెలివరీ వంటి ఈ- కామర్స్ కేటగిరీల్లో జరిపే లావాదేవీలపై తక్షణ డిస్కౌంట్లు, ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది.
ఈ కార్డుపై నెలవారీగా రూ. 49 ఫీజును బ్యాంకు వసూలు చేస్తుంది. గత నెలలో రూ.5,000 లేదా అంతకన్నా ఎక్కువగా కస్టమర్లు కార్డు ద్వారా ఖర్చు చేస్తే ఈ ఫీజును ఎత్తివేస్తుంది. విభిన్న రకాల ఉత్పత్తులను అందించేందుకుగాను మింత్రా, గ్రోఫర్స్, యాత్ర, జొమాటో, ఓలా, ఐనాక్స్ వంటి వాటితో స్టాండర్డ్ చార్టర్డ్ జట్టుకట్టింది.

ఇవీ ఆఫర్లు..
* మింత్రా వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా స్టాండర్డ్ చార్టర్డ్ డిజిస్మార్ట్ కార్డును వినియోగించి కొనుగోళ్లు జరిపితే తక్షణమే 20 శాతం డిస్కౌంట్ ను పొందే అవకాశం కల్పిస్తోంది. ఇందుకు కనీస లావాదేవీ పరిమాణం ఏమీ లేదు.
* ప్రతి నెలలో ఒకసారి ఈ ప్రయోజనం పొందవచ్చు.
*గరిష్టంగా రూ. 700 డిస్కౌంట్ ను ఒక నెలలో పొందవచ్చని బ్యాంక్ చెబుతోంది.
* యాత్ర యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా దేశీయ విమాన టిక్కెట్లు,అంతర్జాతీయ విమాన టిక్కెట్లు బుకింగ్ చేసుకున్నప్పుడు, దేశీయంగా హోటల్ బుకింగ్ చేసుకున్నప్పుడు కూడా తక్షణమే డిస్కౌంట్ ను పొందే అవకాశాన్ని బ్యాంక్ అందిస్తోంది.
* దేశీయ విమాన టికెట్లపై గరిష్టంగా రూ. 750, విదేశీ ప్రయాణ టికెట్లపై గరిష్టంగా రూ. 10,000, దేశీయంగా హోటళ్ల బుకింగ్స్ పై గరిష్టంగా రూ. 4,000 డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది.
* ఓలా రైడ్స్ బుకింగ్ పై 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. గరిష్టంగా నెల రోజులలో రూ. 600 క్యాష్ బ్యాక్ ఇస్తోంది. క్యాబ్ రైడ్స్ పై మాత్రమే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. బైక్స్, ఆటో, షేర్ రైడ్స్ కు ఉండదు.
*జొమాటో అప్ లేదా వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ పరిమాణం రూ. 150 దాటితే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
* గ్రోఫర్స్, ఐనాక్స్ లలో జరిపే లావాదేవీలపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి.
* ఈ కార్డు కావాలనుకునే వారు అవసరమైన అర్హత, డాక్యుమెంట్లు, ఇతర వివరాల కోసం బ్యాంక్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications