ముంబై: రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బాండ్ కనెక్షన్‌తో పాటు సెట్ టాప్ బాక్స్ కూడా ఉచితంగా ఇవ్వనుందని తెలుస్తోంది. కేబుల్ టీవీ, డీటీహెచ్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఇలా చేయవచ్చునని భావిస్తున్నారు. ఆప్టికల్ ఫైబర్ ఆధారిత జియో ఫైబర్ బ్రాండ్ బాండ్ సేవలను ఈ రోజు... సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభిస్తున్నారు. కస్టమర్లకు సెట్ టాప్ బాక్స్ (STB) ఉచితంగా అందించే వీలుందని చెబుతున్నారు. దీంతో టీవీ ద్వారా వీడియో కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. STB ఒక కెమెరాను అనుసంధానం చేస్తే ఇది సాధ్యమవుతుంది.
జియో ఫైబర్ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్ టాప్ బాక్స్ లభిస్తుంది అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే పేరొందిన ఎంటర్టైన్మెంట్ మొబైల్ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు కూడా జియో ఫైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు కలిపే బ్రాడ్ బాండ్ కనెక్షన్ ఛార్జీలు ఉంటాయి. ప్రత్యేకంగా కంటెంట్‌కు చెల్లించాల్సిన అవసరం లేదు.

రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి...
- రిలయన్స్ జియో ఫైబర్ లింక్‌కు వెళ్లాలి. కనెక్షన్‌ను యాక్సెస్ చేయాల్సిన అడ్రస్‌ను పేర్కొనాలి.
- ఆ తర్వాత పేజీలో పేరు, మొబైల్ నంబర్ ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేయాలి.
- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. సూచించిన బాక్సులో ఎంటర్ చేయాలి.
- OTP నిర్ధారణ అనంతరం జియో సేల్స్ ప్రతినిధికి ఫైబర్ కనెక్షన్ తీసుకోవడానికి కావాల్సిన ఆదార్, ఓటరు ఐడీ, పాన్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిల్లో ఏదైనా ఇవ్వాలి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications