ముంబై: జీడీపీ గణాంకాలు, బలహీన మౌలిక రంగం, తగ్గిన ఆటో సేల్స్, అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూలత నేపథ్యంలో మంగళవారం భారత మార్కెట్లు భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,800 దిగువకు చేరుకున్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మంగళవారం మార్కెట్లు ఆది నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. వాహన షేర్లు నష్టాల్లో ట్రేడ్ ముగించాయి. బ్యాంకుల విలీనం అనంతరం ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు నష్టపోయాయి. ఈ నెలలో (సెప్టెంబర్) మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మార్కెట్‌కు ఊతం
సెప్టెంబర్ సిరీస్‌లో నిఫ్టీ 10,300 నుంచి 11,585 పాయింట్ల శ్రేణిలో ఉండవచ్చునని పలు బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి. నెమ్మదించిన ప్రోత్సాహకాలను, సంస్కరణలను ప్రభుత్వం నుంచి ఇన్వెస్టర్లు ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. జీడీపీ 5 శాతానికి పరిమితం కావడం, ఆటో సేల్స్ తగ్గడంతో ఈ రంగానికి జీఎస్టీ తగ్గించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్‌కు ఊతమిస్తుందని భావిస్తున్నారు.

బ్యాంకుల విలీనం వల్ల...
దేశ జీడీపీ ఆరేళ్ళ కనిష్టానికి పడిపోయింది. మేకింగ్, ఫార్మింగ్ రంగాల్లో వృద్ధి మందగించింది. జనవరి - మార్చి త్రైమాసికంలో 5.8 జీడీపీ ఉండగా, జూన్ త్రైమాసికంలో 5 శాతానికి పడిపోయింది. గత పదిహేను రోజుల్లో నిర్మల రెండు పర్యాయాలు మీడియా ముందుకు వచ్చి పలు సంస్కరణలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. అయితే వీటి వల్ల భవిష్యత్తులో సానుకూల పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు. విలీనం అనంతరం బ్యాంకుల షేర్లు ప్రస్తుతానికి పడిపోయినప్పటికీ ముందు ముందు లాభపడతాయని చెబుతున్నారు.

వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే....
మంగళవారం ఐడీబీఐ బ్యాంకుకు రూ.9,300 కోట్ల మూలధన సాయానికి కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో షేర్లు 7 శాతానికి పైగా దూసుకెళ్లాయి. మంచి ఆర్డర్ల కారణంగా యంత్ర పరికరాల షేర్లు రాణించే అవకాశముందని భావిస్తున్నారు. ఔషధ షేర్లు కూడా లాభాల్లో ఉండవచ్చునని అంచనా. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉండవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఆటో సేల్స్ ప్రభావం...
ఆటో సేల్స్ తగ్గడంతో నిఫ్టీ భారీగా నష్టపోయింది. ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఆటో వంటి వివిధ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించినప్పటికీ, మార్కెట్ ధోరణి పెరిగినప్పుడు విక్రయానికే మొగ్గు చూపుతున్నట్లుగా ఉందని, ఈ నేపథ్యంలో నిఫ్టీ 10,500 పాయింట్ల కిందకు చేరే అవకాశముందని భావిస్తున్నారు. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం భయాలు, అంతర్జాతీయ మార్కెట్ కారణంగా లోహధరలపై ప్రభావం పడింది.

మరింత పతనం కాకపోవచ్చు....
ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్ పైన పడే అవకాశాలు మరికొద్ది రోజులు ఉన్నాయని, ఆటో సేల్స్ పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుందని అంటున్నారు. ఇన్వెస్టర్లు కొనుగోలు అవకాశాల కోసం ఎదురు చూస్తుండటంతో మార్కెట్లు మరింతగా పతనం కాకపోవచ్చునని చెబుతున్నారు.

చమురు ధరలు ఓకే...
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూలమని నిపుణులు చెబుతున్నారు. అయితే డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ఇబ్బందికర అంశమని చెబుతున్నారు.

FPI
కేంద్ర ప్రభుత్వం మార్కెట్లకు ఊతమిచ్చేందుకు అనేక చర్యలు చేపట్టినా ఇన్వెస్టర్లకు అమెరికా - చైనా భయాలు ఉన్నాయి. FPIలు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం సర్‌ఛార్జ్‌ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో కాస్త సమయం తీసుకుంటుందని చెబుతున్నారు.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications