ముంబై: భారత మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. క్వార్టర్ 1 జీడీపీ 5గా ఉండటం, ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంతో పాటు వివిధ కారణాల వల్ల నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 770 పాయింట్లు నష్టపోయి 36,562 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 225 పాయింట్లకు పైగా కోల్పోయి 10,798 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.35 వద్ద ఉంది.

మార్కెట్ నష్టానికి కారణాలు...
మార్కెట్లు ఉదయం నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. ప్రారంభంలో 375 పాయింట్లు కుంగిపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించింది. కానీ భారీ నష్టంతో ట్రేడింగ్ క్లోజ్ అయింది. నిఫ్టీది అదే పరిస్థితి. దేశీయ, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, బ్యాంకుల విలీనం, క్వార్టర్ 1 జీడీపీ 5గా మాత్రమే ఉండటం మార్కెట్లకు నష్టాలు తెచ్చిపెట్టాయి.

నష్టపోయినవి.. లాభపడ్డవి...
ఫైనాన్షియల్, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లు ఒత్తిటికి గురయ్యాయి. ఏ దశలోను కోలుకోలేదు. బీఎస్ఈ, సెన్సెక్స్ 2 శాతానికి పైగా నష్టపోయాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఐవోసీ, అల్ట్రా టెక్ సిమెంట్, టైటాన్, టాటా స్టీల్ వంటి కంపెనీలు నష్టాల్లో ముగిశాయి.

అన్ని బ్యాంకులు నష్టాల్లోనే...
PNB 9 శాతం, ICICI బ్యాంకు 4 శాతం, HDFC బ్యాంకు 4 శాతం, యాక్సిస్ బ్యాంకు 3 శాతం నష్టపోయాయి. ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకులు 10 నుంచి 12 శాతం మేర నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో PSU బ్యాంకింగ్ ఇండెక్స్ 5 శాతం కోల్పోయింది. 10 బ్యాంకుల విలీనం మార్కెట్లకు రుచించలేదు.

పడిపోయిన ఆటో షేర్స్
మిగతా స్టాక్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్, బాస్, మదర్సన్ సుమీ అండ్ ఫిచ్చర్ మోటార్స్ 3, 4 శాతం నష్టపోయాయి. టాప్ ఆటో మేకర్స్ సేల్స్ ఆగస్ట్ నెలలో భారీగా తగ్గిన విషయం తెలిసిందే. టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ కంపెనీల షేర్లు 2.61 శాతం నష్టపోయాయి. మారుతీ సేల్స్ ఆగస్ట్ నెలలో 33 శాతం పడిపోయాయి. టాటా మోటార్స్ 58 శాతం కోల్పోయాయి. ఈ నేపథ్యంలో ఆటో షేర్లు పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3 శాతం కోల్పోయాయి.

జీడీపీ ఎఫెక్ట్
ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు తగ్గడంతో క్వార్టర్ 1 జీడీపీ (జూన్ క్వార్టర్) 5 శాతంగా మాత్రమే ఉంది. అంచనాల కంటే తక్కువ జీడీపీ నమోదయింది. ఐసీఐసీఐ బ్యాంకు ఆర్థిక నిపుణుల ప్రకారం.... అంచనా వేసిన దాని కంటే కూడా జీడీపీ చాలా తక్కువగా ఉందని, ఇది సమన్వయ ద్రవ్య, ఆర్థిక విధాన చర్యల అవసరాన్ని నొక్కి చెబుతోంది.

బలహీన కోర్ డాటా
బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి తగ్గడంతో జూలైలో 8 ప్రధాన పరిశ్రమల అభివృద్ధి 2.1 శాతానికి పడిపోయింది. ప్రైవేటు ఫోర్ కాస్టర్ PMI డాటా కూడా దేశీయ మానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఆగస్ట్ నెలలో గత 15 నెలల కనిష్టానికి దిగజారింది. IHS మార్కిట్ ఇండియా మానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఆగస్ట్‌లో 51.4 శాతానికి దిగజారింది. 2018 మే తర్వాత ఇది అత్యల్పం. జూలై నెలలో 52.5 శాతంగా ఉంది. ONGC షేర్లు 3 శాతం కోల్పోయాయి.

రూపాయి బలహీనం... FPI
డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోతోంది. మంగళవారం 64 పైసలు పడిపోయి 72 మార్క్‌ను (72.37) దాటింది. అంతకుముందు సెషన్‌లో రూ.71.40 వద్ద క్లోజైంది. బలహీన మాక్రో ఎకనామిక్ డేటా, FPIల నిరంతర ఔట్ ఫ్లో దీనికి కారణం. ఒక్క ఆగస్ట్ నెలలో దేశీయ మార్కెట్ నుంచి FPIలు రూ.5,920 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అయితే సర్‌చార్జ్‌ను ఆ తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. జూలై నెలలో రూ.2,985.88 కోట్లు వెనక్కి తీసుకున్నారు.
More From GoodReturns

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు



Click it and Unblock the Notifications