ముంబై: బ్యాంకుల విలీనం, క్వార్టర్ 1 జీడీపీ వృద్ధి రేటు ఐదు శాతంగా మాత్రమే ఉండటం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు మంగళవారం నాడు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 769 పాయింట్లు నష్టపోయి 36,562 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 10,797 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.35 వద్ద ఉంది.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనం వల్ల ఈ బ్యాంకులు భారీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకులు 2.2 శాతం నష్టపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రయివేటు రంగ బ్యాంకులు కూడా నష్టపోయాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు 9%, ICICI బ్యాంకు 4%, HDFC 4%, ఆర్బీఎల్ 4%, యాక్సిస్ బ్యాంకు 3% నష్టపోయాయి.

ఎన్ఎస్ఈలో PSU బ్యాంకులు 5 శాతం మేర నష్టపోయాయి. ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్‌లు 10 నుంచి 12 శాతం మధ్య నష్టపోయాయి. గత ఆరేళ్లలో తొలిసారి జీడీపీ 5 శాతానికి పడిపోయింది. దీంతో అప్పటి నుంచి సెన్సెక్స్ 850 పాయింట్లు కోల్పోయి 36,466కు పడిపోయింది. దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఆగస్ట్‌లో 15 నెలల కనిష్టానికి పడిపోయిందని ఓ సర్వే వెల్లడించింది.
గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్ ఓ రోజులో భారీగా నష్టపోవడం ఇదే కావడం గమనార్హం. సెన్సెక్స్ 2 శాతం పడిపోయి 36,562, నిఫ్టీ 2 శాతం కోల్పోయి 10,797 కంటే కిందకు దిగజారింది.
వినియోగం తగ్గడం, ఉత్పాదక కార్యకలాపాలు తగ్గడం వల్ల ఆర్థిక వృద్ధి క్షీణించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. PSU బ్యాంకుల విలీనం ఏకీకరణ దిశగా సరైన అడుగు అని, అయితే సినర్జీ నుంచి ప్రయోజనాలకు సమయం పడుతుందన్నారు. బలహీన ఆటో సేల్స్, FPIలు వెనక్కి వెళ్లడం, రూపాయి విలువ పడిపోవడం కూడా దీనికి కారణమన్నారు.
నిఫ్టీ జూన్ నెలలో గరిష్టానికి చేరుకున్న తర్వాత 10 శాతానికి పైగా కోల్పోయింది. బలహీన సేల్స్, ప్రపంచంలోని అనిశ్చితి సూచనలు మార్కెట్ల పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. ఆర్థిక వ్యవస్థలో సానుకూల సంకేతాలు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. రూపాయి బలహీనపడటం ఆందోళన కలిగించే అంశమన్నారు. అమెరికా - చైనా ట్రేడ్ వార్ కూడా వాణిజ్య భయానికి కారణాలని చెప్పారు.
బీఎస్ఈలో ఈ రోజు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లు కూడా వరుసగా 1.6 శాతం, 1.3 శాతం నష్టపోయాయి. ONGC 3 శాతం పడిపోయింది. భారత మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. క్వార్టర్ 1 జీడీపీ 5గా ఉండటం, ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంతో పాటు వివిధ కారణాల వల్ల నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 770 పాయింట్లు నష్టపోయి 36,562 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 225 పాయింట్లకు పైగా కోల్పోయి 10,798 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications