గురుగ్రామ్: కొత్త మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం భారీ జరిమానాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. రెండు మూడు రాష్ట్రాల్లో మినహా దీనిని దేశంలో అంతటా అమలు చేస్తున్నారు. ఇదివరకు ఉన్న ట్రాఫిక్ చలాన్ల కంటే పది రెట్ల జరిమానాను ఇప్పుడు విధిస్తున్నారు. ఇందులో భాగంగా గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా రూ.23,000 జరిమానా విధించారు పోలీసులు. కొత్త ట్రాఫిక్ నిబంధనల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ఇది హెచ్చరిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాలంటే ఇప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.

రూ.23,000 జరిమానా
ఢిల్లీకి చెందిన దినేష్ మదన్ అనే వ్యక్తి తన బైక్ పైన వెళ్తున్నాడు. అతనిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. లైసెన్స్, ఆర్సీ డాక్యుమెంట్స్ ఇంటివద్ద ఉండిపోయాయి. లైసెన్స్, ఆర్సీ లేకపోవడంతో పాటు హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇన్సురెన్స్ లేకపోవడం వంటి పలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద అతనికి రూ.23,000 జరిమానా వేశారు పోలీసులు.

రూ.15 వేల బైక్.. అంతకంటే ఎక్కువ జరిమానా
తన చలాన్‌ను చూసి షాకైన దినేష్ మదన్‌కు ఏం చేయాలో ఆర్థం కాలేదు. అతను ఈ బైక్‌ను సెకండ్ హ్యాండ్‌లో రూ.15 వేలకు కొనుగోలు చేశాడు. కానీ అతనికి పడిన జరిమానా రూ.23 వేలు. దీంతో అతను ఆ బైక్‌ను అక్కడే వదిలేసి వచ్చాడు. లైసెన్స్ లేని డ్రైవింగ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్, థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేని డ్రైవింగ్, ఎయిర్ పొల్యూషన్ నిబంధనల ఉల్లంఘన,హెల్మెట్ లేని డ్రైవింగ్‌కు గానూ అతనికి ఈ భారీ జరిమానా పడింది.

షాకయ్యా...
దీనిపై దినేష్ మదన్ మాట్లాడుతూ... చలాన్ చూసి నేను షాకయ్యానని, ఇది చిన్న మొత్తం ఏమీ కాదని, ప్రస్తుతం తన వద్ద డాక్యుమెంట్స్ లేవని, ఇంటి వద్ద ఉన్నాయని పోలీసులకు తాను చెప్పానని, కానీ 10 నిమిషాల్లో వాటిని తీసుకు రావాలని చెప్పారని, కానీ ఢిల్లీలో ఉండే తాను గురుగ్రామ్‌కు అంత త్వరగా ఎలా తీసుకు వస్తానని, దీంతో పోలీసులు తన బైక్ కీ తీసుకున్నారని చెప్పారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications