పెరిగిన బంగారం ధరలు... రూపాయి బలహీనంతో రికార్డ్ హైకి వెండి
ముంబై: బంగారం ధరలు మంగళవారం నాడు భారత మార్కెట్లలో రికార్డ్ హై సమీపానికి చేరుకున్నాయి. డాలర్ మారకంతో రూపాయి విలువ పడిపోవడంతో బంగారం ధరకు డిమాండ్ వస్తోంది. వెండి ధర కూడా రికార్డ్ హైకి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో 0.42% శాతం పెరిగి పది గ్రాములు రూ.39,109, వెండి కిలో ధర రూ.48,970 (0.5% పెరిగి) అత్యధిక ధరకు చేరుకుంది. డాలర్‌తో రూపాయి గత సెషన్‌లో రూ.71.40 ఉండగా, మంగళవారం అది రూ.72పైకి చేరుకుంది. బంగారం ధరలు గత వారం రికార్డ్ హైకి చేరుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో రూ.39,425 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 0.3 శాతం పెరిగి ఔన్సుకు 1,525 డాలర్లకు చేరుకుంది. గత వారం ఆరేళ్ల గరిష్టానికి $1,554.56 చేరుకున్న బంగారం, మళ్లీ పెరుగుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్‌గా బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ధరలు ఈ ఏడాది 20 శాతానికి పైగా పెరిగాయి.

అమెరికా - చైనా ట్రేడ్ వార్, సెంట్రల్ బ్యాంకులు మానిటరీ పాలసీ వంటి వివిధ కారణాలు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు పురిగొల్పుతున్నాయి. బ్లూమ్‌బర్గ్ ప్రకారం బంగారం ETFలలోకి ఆగస్ట్ నెలలో 100 టన్నులు వచ్చింది. 2013 ఫిబ్రవరి తర్వాత అత్యంత ఎక్కువగా రావడం ఇప్పుడే. హోల్డింగ్స్‌లలో 101.9 టన్నులు పెరిగింది. జూన్, జూలై తర్వాత ఏప్రిల్ నెలలోను పెరుగుదల కనిపించింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు 10 శాతాన్ని బంగారంపై పెట్టుబడిగా పెట్టాలని ప్రఖ్యాత ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ ఇటీవల తెలిపింది. ఇటీవల అమెరికా - చైనా మధ్య టారిఫ్ యుద్ధం సాగుతోంది. చైనీస్ ఉత్పత్తులపై అమెరికా 15 శాతం అధిక పన్ను విధించనున్నట్లు తెలిపింది. అలాగే అమెరికా క్రూడాయిల్ పైన చైనా కూడా అధిక టారిఫ్ విధిస్తోంది. అమెరికా చర్యలపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో ఫిర్యాదు చేస్తామని కూడా చైనా పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు భారత్‌లో పండుగల సీజన్. కాబట్టి బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారితో పాటు జ్యువెల్లర్స్ నుంచి మరింత డిమాండ్ ఉంటుంది.


Click it and Unblock the Notifications