ముంబై: రిలయన్స్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీకి చెందిన ఇల్లు ఆంటీలియా గణేష్ చతుర్థి సందర్భంగా అందంగా ముస్తాబు చేశారు. అంబానీ కోడలు శ్లోక మెహతాకు ఇది తొలి వినాయక చవితి. దీంతో ఆంటిలీనాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముంబైలో గణేష్ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ముఖేష్ తన కోడలు ఇంట్లో అడుగుపెట్టిన తొలి గణపతి పండుగకు ఇంటిని ముస్తాబు చేయడంతో పాటు ప్రముఖులను ఆహ్వానించారు.

ఇల్లు మాత్రమే కాదు... వీధి కూడా
అత్యాదునిక సదుపాయాలతో ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉన్న అంబానీ ఇల్లు ఆంటీలియాను విద్యుత్ దీపాలతో చాలా అందంగా ముస్తాబు చేశారు. కేవలం ఇల్లు మాత్రమే కాదు ఆ వీధి మొత్తం వెలుగులతో నిండిపోయింది. ఈ సందర్భంగా పలువురు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇవి వైరల్ అవుతున్నాయి.

ఈ పండుగ ఎంతో ప్రత్యేకం
ఈ వినాయక చవితి అంబానీ కుటుంబ సభ్యులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే వీరి కూతురు ఇషా అంబానీ-ఆనంద్ పిరమిల్ వివాహం, అలాగే ఆకశ్ అంబానీ- శ్లోక మెహతా పెళ్లి తర్వాత ఈ ఇంట్లో తొలి గణేష్ చతుర్థి ఇది. దీంతో ఈ కుటుంబం పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంది.

ప్రత్యేక ఆహ్వాన పత్రిక
వారం రోజుల క్రితం అంబానీ ఫ్యామిలీ సన్నిహితులను ఈ పండుగ కోసం ఆహ్వానించింది. దీని కోసం అంబానీ దంపతులు ప్రత్యేక ఆహ్వాన పత్రికను డిజైన్ చేయించారు. దాదాపు ఈ అలంకరణ ఖర్చు రూ.1 కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆంటీలియా విద్యుత్ దీపాలతో మెరిసిపోయింది.

వేలాడుతున్న స్వస్తిక్స్,.. ఓమ్..
ఆంటీలియాను, ఆ రోడ్డును ఆరెంజ్, తెలుపు రంగు పువ్వులతో అలంకరించారు. ఇంటి ముందు వేలాడుతున్న స్వస్తిక్స్, ఓమ్‌లు ఏర్పాటు చేశారు. అంబానీ కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది గణేష్ చతుర్థిని ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి కాస్త స్పెషల్‌గా అలంకరించారు.

బాలీవుడ్ సెలబ్రిటీలు...
గణేష్ చతుర్థి ఉత్సవాల్లో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమీర్ ఖాన్, విక్కీ కౌషల్, సచిన్ టెండుల్కర్, అనిల్ కపూర్, హార్దిక్ పాండ్యా, యువరాజ్ సింగ్ తదితర సెలబ్రీటీలు కూడా పాల్గొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications