అమ్మో... ఎల్ఐసీ ఆస్తులు ఎంతో తెలుసా?
ప్రభుత్వ రంగంలోని బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆస్తులు భారీగా పెరుగుతున్నాయి.ప్రయివేట్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్నప్పటికీ వినూత్న పాలసీలను తీసుకువస్తూ ఎక్కువ మంది పాలసీదారులను ఎల్ఐసీ సంపాదించుకుంటోంది. ఇప్పుడీ సంస్థ ఆస్తులు రూ.31.11 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. వ్యాపారం జోరుగా పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది జూలై నాటికీ దేశీయ బీమా రంగంలో ఎల్ఐసీ మార్కెట్ వాటా 73.1 శాతానికి చేరుకుంది.

ఎల్ఐసీ 5.68 శాతం వృద్ధి
* 2018-19 సంవత్సరంలో తొలి సంవత్సరం ప్రీమియం పరంగా కొత్త వ్యాపారంలో ఎల్ఐసీ 5.68 శాతం వృద్ధి సాధించింది.
* ఈ ఏడాది మార్చి చివరినాటికి తొలి సంవత్సర ప్రీమియం రూ.1,42,192 కోట్ల వరకు ఉంది. మార్కెట్ వాటా 66.24 శాతంగా ఉంది. పాలసీల పరంగా మార్కెట్ వాటా 74.71 శాతంగా ఉంది. ఈ ఏడాది మార్చి చివరినాటికి కొత్తపాలసీలు 2.1 కోట్ల కొత్త పాలసీలను జారీ చేసింది.
* 2018-19 సంవత్సరంలో ఎల్ఐ సి 2.60 కోట్ల క్లెయిమ్ లను సెటిల్ చేసింది. వీటి విలువ రూ. 1,63,104.50 కోట్లుగా ఉంది. క్లైమ్స్ సెటిల్ మెంట్ లో ఎల్ఐసి నెంబర్ వన్ స్థానంలో ఉంది.

ఇదీ చరిత్ర
* ఎల్ఐసీ 1956 సంవత్సరంలో 168 కార్యాలయాలతో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడీ సంస్థకు 4,851 కార్యాలయాలున్నాయి.
* 1956లో ఎల్ఐసీ ప్రారంభ మూలధనం రూ.5 కోట్లు.
* సెప్టెంబర్ 1వ తేదీతో ఎల్ఐసీ ప్రారంభమై 63 ఏళ్ళు పూర్తయింది.
* ఎల్ఐసీ భౌతిక రూపంలో పాలసీ డాక్యుమెంట్లతో పాటు ఈపాలసీని జారీ చేస్తోంది.
* ఈ సంస్థలో లక్షకు పైగా ఉద్యోగులున్నారు. 11.79 లక్షల ఏజెంట్లున్నారు. ఇప్పటివరకు 29.09 కోట్లకు పైగా పాలసీలను ఎల్ఐసీ జారీ చేసింది.

టెక్నాలజీ రంగంలో ముందడుగు...
* పాలసీదారులకు ఎల్ఐసీ మెరుగైన సేవలు అందిస్తోంది. తన పోర్టల్ లో చాలా మార్పులు చేసింది. దీని వల్ల పాలసీదారులు సులభంగా తమ పాలసీలకు సంభందించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటోంది. పాలసీల ప్రీమియం కూడా చాలా సులభంగా చెల్లించవచ్చు.
* ఆన్ లైన్ సర్వీసులకు 1.13 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లున్నారు. సగటున రోజువారీ లక్షకు పైగా వినియోగదారులు లాగిన్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications