భారత్ లో ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి మొత్తంగా వాటి సంఖ్యను 12 కు కుదించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టమైన నిర్ణయం కూడా వెలువరించారు. ఏ బ్యాంకులో ఏ బ్యాంకు విలీనం కాబోతోందో కూడా చెప్పేశారు. ఇక మిగిలింది విలీనమే. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మేలు చేయబోదని చాలా మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడే విలీనం చేయాలను కోవడం ఇంకా పెద్ద తప్పు అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సరైన కారణాలను కూడా చెబుతున్నారు.
అయితే, ప్రభుత్వం ఒక సారి నిర్ణయం తీసుకున్నాక, అందులో మార్పు కష్టమే. అందునా ప్రధాని నరేంద్ర మోడీ తానూ తలచింది జరగాల్సిందే అనే ధోరణి బ్యాంకుల విలీనం లో ప్రభుత్వ నిర్ణయం మార్పు ఉండదని స్పష్టం చేస్తుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం వేగంగా పావులు కదిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంకుల యూనియన్లు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నా... అవి గతంలో మాదిరి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేంత బలంగా లేవు. అందుకే, బ్యాంకుల విలీనం జరిగి కేవలం 12 అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రమే మిగలటం ఖాయం.

బ్యాంకుల సంఖ్య తగ్గటం కాదు ... రుణాలు పెరగాలి
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం లోకి జారుకొంటోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి జీడీపీ గణాంకాలు కూడా దీనినే సమర్థిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తోలి త్రిమాషికంలో భారత జీడీపీ వృద్ధి రేటు కేవలం 5% గా నమోదు ఐంది. ముందస్తు అంచనా ఐన 5.8% వృద్ధి కూడా సాధ్యం కాలేదు. గత 25 త్రిమాషీకాల్లో ఇదే అత్యంత తక్కువ వృద్ధి రేటు కావటం గమనార్హం. దీనికి గత ప్రభుత్వాలను నిందించే అవకాశం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే... గత 5 ఏళ్లుగా పరిపాలన సాగిస్తోంది ఈ ప్రభుత్వమే కాబట్టి.... ఆర్థిక మాంద్యానికి ఎవరినీ దోషిగా చెప్పలేని పరిస్థితి. ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి. ప్రైవేట్ రంగం పెట్టుబడులకు వెంకడుతున్న తరుణంలో ప్రభుత్వమే ఇందుకు నడుం బిగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీగా మూల ధన నిధులను అందించటం వాళ్ళ వ్యవస్థలో రుణ లభ్యతను పెంచాల్సి ఉంటుంది. ఈ దిశగా ఇప్పటికే బ్యాంకింగ్ రంగానికి రూ 70,000 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తామన్న ఆర్థిక మంత్రి ప్రకటనలు చేతుల్లోకి రాలేదు. పైగా .... రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి తీసుకొన్న రూ 1.76 లక్షల కోట్లను ఏ విధంగా ఖర్చు చేయనుందో ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదు. ఒక వైపు పేరుకు పోయిన నిరర్థక ఆస్తులను తగ్గించుకొని, నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న బ్యాంకులకు విలీనం పేరుతో మరో బాధ్యతను నెత్తిన రుద్దితే... అవి రుణాల మంజూరు కంటే కూడా విలీనం పైనే అధిక దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు గొడ్డలి పెట్టు వంటిదే అని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకుల సంఖ్యా తగ్గటం ముఖ్యం కాదని... రుణాల లభ్యత పెరగాలని వారు సూచిస్తున్నారు.

అన్నీ ఆకస్మిక నిర్ణయాలే....
ప్రధాని మోడీ ప్రభుత్వం అన్ని నిర్ణయాలనూ ఆకస్మికంగానే ప్రకటిస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370, బ్యాంకుల విలీనం ఇలా ... ముఖ్యమైన నిర్ణయాలను హఠాత్తుగా వెల్లడిస్తోంది. దీంతో ప్రయోజనాలు అటుంచి ... వినాశనమే అధికంగా కనిపిస్తోంది. ఆర్టికల్ 370 మాత్రం ఇక్కడ ప్రస్థావన అవసరం లేని విషయం. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. వ్యవస్థలో నగదు చలామణి తగ్గలేదు సరికదా పెరిగింది. పన్నుల వసూళ్ల లో వృద్ధి లేదు. ఒకటి రెండు నెలలు మినహాయిస్తే... ఇప్పటివరకు జీఎస్టీ వసూళ్లు రూ 1 లక్ష కోట్లు దాటింది లేదు. అందుకే, ప్రభుత్వం వద్ద సరైన మోతాదులో నగదు లభ్యత ఉండటం లేదు. అన్నీ ప్రకటలు తప్ప ఆచరణలో అమలు జరగటం లేదు. ఈ కారంగానే రిజర్వు బ్యాంకు నుంచి ముక్కు పిండి మరీ దాదాపు రేడు లక్షల కోట్లు తీసుకొన్న ప్రభుత్వం.... ఆ నిధులను సద్వినియోగం చేయటంలో మాత్రం ముందడుగు వేయటం లేదు.

పెద్ద వాటి కంటే చిన్నవే బెస్ట్...
బ్యాంకులు పెద్దవిగా ఉంటె అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. పెద్ద ప్రాజెక్టులకు భారీగా రుణాలు మంజూరు చేయొచ్చు అని చెప్పారు. కానీ... భారత్ లో భారీగా రుణాలు తీసుకొన్న ఏ పెద్ద ప్రాజెక్టు నుంచీ ఏ బ్యాంకు తన రుణాలను పూర్తిగా వసూలు చేసుకోలేక పోయిందన్న విషయాన్నీ ప్రభుత్వం గ్రహించటం లేదు. విజయ్ మాల్యా, నిరవ్ మోడీ సహా చాల కార్పొరేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో రుణాలను పొంది ఎగవేతదారులుగా మిగిలి పోయాయి గానీ.... రుణాలను తిరిగి చెల్లించ లేదు. దాంతో భారీ మొత్తంలో రుణాలు యించిన బ్యాంకులు కుయ్యో మొర్రో అంటూ నష్టాల బాట పట్టాయి. ఆ ప్రభావం చిన్న వ్యాపారాలు, రైతులు, వ్యక్తిగత రుణాల మంజూరుపై పడింది. బ్యాంకు పెద్దది అయితే... పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేసే సామర్థ్యం లభిస్తుందేమో కానీ... వాటిని తిరిగి రాబట్టుకునే సామర్థ్యం ఉంటుందని చెప్పటం కష్టం. లేమాన్ బ్రదర్స్ సంక్షోభం ప్రపంచాన్నే ఎంతలా ప్రభావితం చేసిందో మన ప్రభుత్వం గుర్తించటం లేదు. అదే చిన్న బ్యాంకులు గా ఉంటె... రుణాలు చిన్న పరిమాణంలో ఇచ్చినా వాటిని తిరిగి రాబట్టు కోగలవు. లేదా... చిన్న మొత్తంలో నిరర్థక ఆస్తులను బ్యాంకులు లేదా ఆర్థిక వ్యవస్థ కూడా భరించగలదు.

నిర్వహణ లాభాలూ శూన్యమే...
చిన్న చిన్న బ్యాంకులను కలిపి పెద్దవిగా మార్చటం వల్ల నిర్వహణ పరంగా లాభాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ అది కూడా నిజం కాదు. ఎందుకంటే... బ్యాంకుల ఉద్యోగుల సంఖ్యను తగ్గించకుండా .... పెద్దగా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోలేవు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం కూడా సరైనది కాదు. ఇప్పటికే దేశంలో నిరుద్యోగ రేటు 10 ఏళ్ళ గరిష్ఠానికి చేరుకొంది. ఆటోమొబైల్ వంటి రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఊగుతున్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ రంగం దానికి తోడైతే... వినాశనమే తప్ప ప్రయోజనం ఉండదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పైగా... సంస్థ పెద్దది అయినా కొద్దీ బ్యూరోక్రసి పెరిగి పనితీరు కూడా మందగిస్తుందే తప్ప వేగం పెరగదని వారు విశ్వషిస్తున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications