న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) కలెక్షన్లు ఆగస్ట్ 2019 నెలలో తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక ఇది అత్యల్పం. జూన్ నెలలో రూ.99,939 కోట్లు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్, ఆగస్ట్ నెలలు మినహా మిగతా నెలల్లో కలెక్షన్లు రూ.1లక్ష కోట్ల మార్క్ దాటాయి.
అదే సమయంలో 2018లో ఆగస్ట్ నెలలో కంటే 4.51 శాతం పెరిగాయి. గత ఏడాది రూ.93,960 వసూళ్లు కాగా, ఈ ఏడాది రూ.98,202గా ఉన్నాయి. రూ.98,202 కోట్లలో రూ.17,773 కోట్లు కేంద్రం జీఎస్టీ కాగా, రాష్ట్రాల జీఎస్టీ వాటా రూ.24,239 కోట్లు. సమీకృత జీఎస్టీ రూ.48,958 కోట్లు. సెస్ రూ.7,273 కోట్లు.

జీఎస్టీ తగ్గుదలకు ఆర్థిక మందగమనమే కారణంగా చెబుతున్నారు. ఉత్పాదక రంగం, సేవా రంగంలో నెలకొన్ని స్తబ్దత కారణంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని, దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపై పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. జీఎస్టీ తగ్గుదల నేపథ్యంలో ఆర్థిక లోటుపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.
మరోవైపు, ఆగస్ట్ నెలలో జీఎస్టీ వసూళ్లు తగ్గడమే సాధారణమేనని చెబుతున్నారు. దీనిని ఆర్థిక మందగమనానికి ఆపాదించలేమని చెబుతున్నారు. ఆగస్ట్‌లో తగ్గినప్పటికీ అక్టోబర్ - డిసెంబర్ ఫెస్టివెల్ సీజన్ అని, అప్పుడు ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications