న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు పెరిగాయి. జెట్ ఫ్యూయల్ ధరలు ఒక శాతం తగ్గాయి. ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర రూ.596.62/కిలోలీటర్ (0.9 శాతం) తగ్గి రూ.62,698.86//కిలోలీటర్‌గా ఉంది. అంతర్జాతీయ చమురు ధరల ప్రభావం నేపథ్యంలో ఈ ఫ్యూయల్ ధర ఒక శాతం తగ్గి నాలుగు నెలల కనిష్టానికి తగ్గింది. అదే సమయంలో మార్కెట్ ధర లేదా సబ్సిడీ లేని వంట గ్యాస్ (ఎల్పీజీ) ధర సిలిండర్‌కు రూ.15.50 పెరిగింది.

రూ.15.50 పెరిగిన ధర
ఇంటి అవసరాల కోసం వినియోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ రేటు తగ్గి నెల రోజులు గడవకముందే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మళ్లీ ధరలు పెరిగాయి. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.15.50 పెంచినట్లు ప్రభుత్వరంగ ఇంధన రిటైల్ సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.574.50 ఉండగా పెరిగిన ధరతో రూ.590కి చేరుకుంది. ఈ మార్పులు ఆదివారం నుంచి (సెప్టెంబర్ 1) అమల్లోకి వచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం, ధరల పెరుగుదల.. వంటి ప్రభావం ధరలపై పడిందన్నారు.

ఇంధన ధరలు..
ఎల్పీజీతో పాటు ఇంధన సంస్థలు విమాన ఇంధన ధరలు సవరించాయి. అంతర్జాతీయ ఆయిల్ ధరలు నిలకడగా ఉండటంతో జెట్ ధరను తగ్గించనట్లు ఇంధన సంస్థలు తెలిపాయి. దీంతో విమాన ఇంధన ధర నాలుగు నెలల కనిష్టానికి తగ్గినట్లయింది.

కిరోసిన్ ధర
కిరోసిన్ ధర కూడా పెరిగింది. ముంబైలో గత నెలలో రూ.32.97 ఉన్న ధర ఇప్పుడు రూ.33.27 గా ఉంది. 2016 జూలై నుంచి కిరోసిన్ పైన ప్రతి నెల 25 పైసలు పెంచుతున్నారు. కాగా సబ్సిడీ సిలిండర్ ధరలు ఇటీవలే రూ.62 వరకు తగ్గించారు. నెల రోజుల తర్వాత కాస్త పెంచారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications