సెప్టెంబర్-2019 బ్యాంకు సెలవుల పూర్తి జాబితా.. 9రోజులు హాలీడేస్
రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, దసరా వంటి పర్వదినాల్లో బ్యాంకులు మూతబడుతాయి. కొన్ని పండుగలు ఆయా రాష్ట్రాల్లో... ఆయా తేదీల్లో నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాన్ని అనుసరించి కూడా ఆయా బ్యాంకులు సెలవులను ప్రకటిస్తాయి. కాబట్టి బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాన్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణకు బాబా శ్రీచంద్ జయంతి సందర్భంగా పంజాబ్, ఓనమ్ పండుగ రోజు కేరళలో సెప్టెంబర్ 11వ తేదీన బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లో ఆ సెలవులు వర్తించవు.

తొమ్మిది రోజులు సెలవులు.. నో నేషనల్ హాలీడేస్
2019 సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు మొత్తం తొమ్మిది రోజులు సెలవులు ఉన్నాయి. పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఆదివారం బ్యాంకులను క్లోజ్ చేస్తాయి. అలాగే, రెండో, నాలుగో శనివారం కూడా సెలవుదినం. సెప్టెంబర్ నెలలో నేషనల్ హాలీడేస్ ఏమీ లేవు. ఎక్కువగా స్టేట్ వైడ్ హాలీడేస్ మాత్రమే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సెలవులు...
సెప్టెంబర్ నెలలో మొత్తం ఐదు ఆదివారాలు ఉన్నాయి. 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారం వస్తోంది. రెండో శనివారం 14వ తేదీన, నాలుగో శనివారం 28వ తేదీన వస్తోంది. సాధారణ ఆది, శనివారం సెలవులే 7 ఉన్నాయి. ఇవి కాకుండా వినాయక చవితి, మొహర్రం పండుగలకు సెలవులు ఉంటాయి. 2వ తేదీన వినాయక చవితి, 10వ తేదీ మొహ్రం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు దినాలు.

రెండో తేదీన గణేష్ చతుర్థి
02-09-2019 సోమవారం రోజున గణేష్ చతుర్థి కాబట్టి బ్యాంకులకు సెలవు దినం. సెప్టెంబర్ 3న నౌకాయి ఉత్సవం కారణంగా ఒడిశా, గుజరాత్‌లలో, 9న మొహర్రం సందర్భంగా ఒడిశా, జార్ఖండ్, 10న మొహర్రం సందర్భంగా త్రిపుర, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బెంగాల్, న్యూఢిల్లీ, బీహార్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలల్లో, 11న మొహర్రం సందర్భాంగా గుజరాత్, కేరళ రాష్ట్రాలలో సెలవులు ఉన్నాయి.

కేరళలో 21న సెలవు...
సెప్టెంబర్ 13వ తేదీన ఇంద్రజాతర పండుగ సందర్భంగా సిక్కిం, కేరళ రాష్ట్రాల్లో, 17న విశ్వకర్మ పూజ సందర్భంగా జార్ఖండ్‌లో, 21న శ్రీ నారాయణ గురు సమాధి డే సందర్భంగా ఉత్తర ప్రదేశ్, కేరళల రాష్ట్రాల్లో, 28న మాలవీయ అమావాస్య సందర్భంగా కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాలలో సెలవు రోజులు.


Click it and Unblock the Notifications