ఐటమ్ భామలకు కాసుల పంట, రూ.6 కోట్లతో సన్నీలియోన్ టాప్
ఐటమ్ సాంగ్... ప్రస్తుత కాలంలో సినిమా థియేటర్ వైపు జనాన్ని నడిపిస్తున్న దాంట్లో ఇది కూడా ముందుంది. ఐటమ్ సాంగ్.. కాకుండా ఫలానా నటి ఈ ఐటమ్ సాంగ్ చేసిందంటే చాలు.. థియేటర్లు నిండిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమా ఐటమ్ పాటల్లో ముమైత్ ఖాన్ ఎంతో జోరు కనబరిచింది. తమన్నా, శృతి హాసన్, కాజల్ అగర్వాల్ నుంచి ఇటీవలి పాయల్ రాజ్‌పుత్ వరకు ఎంతోమంది హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్‌ల్లో నటిస్తున్నారు. సన్నీలియోన్ కూడా అడపాదడపా ఐటమ్ సాంగ్స్‌లలో కనిపిస్తోంది. వీరు హీరోయిన్‍లతో పోటీ పడి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్‌కు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న భామలు..

జాక్వలైన్ ఫెర్నాండేజ్, కాజల్ అగర్వాల్
శ్రీలంకన్ భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్ సాహో సినిమాలో ప్రభాస్‌తో చిందేసింది. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం ఆమె రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలోని నేను పక్కా లోకల్ ఐటమ్ సాంగ్ కోసం పెద్ద మొత్తంలోనే తీసుకున్నట్లుగా వినికిడి.

మలైకా అరోరా
మలైకా అరోరా ఎన్నో ఐటమ్ సాంగ్స్‌ల్లో నర్తించింది. వీటి వల్లే ఆమె మరింతగా ఫేమస్ అయింది. ఆమెతన బెస్ట్ డ్యాన్స్‌తో సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఐటమ్ సాంగ్స్‌తో సినీ అభిమానులను థియేటర్‌కు రప్పిస్తున్న ఈ భామ రూ.2 కోట్లకు పైగా తీసుకుంటోంది. చయ్య.. చయ్యా అనే పాట ఉర్రూతలూగించింది.

దీపికా పదుకొణే
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దీపికా పదుకొణే ఖరీదైన హీరోయిన్. హీరోయిన్‌గా డిమాండ్ ఉన్నప్పటికీ సినిమాల్లో ఐటమ్ సాంగ్ కోసం రూ.3 కోట్ల వరకు తీసుకుంటోంది.

కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ తెలుగులోనూ నటించింది. తెలుగు సినిమా మల్లీశ్వరితో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్‌లో చికినీ చమేలి పాటతో దుమ్ము రేపింది. కత్రినా కైఫ్ ఒక్కో ఐటమ్ సాంగ్‌కు రూ.4 కోట్ల వరకు తీసుకుంటోందట.

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ సినిమాల వరకు నటించింది. ఫ్యాషన్ సినిమాతో ఆమె మరింత పాపులర్ అయింది. ఈమె ఐటమ్ సాంగ్ కోసం రూ.4 కోట్ల వరకు తీసుకుంటోంది.

సన్నీ లియోన్
సన్నీలియోన్ బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఐటమ్ సాంగ్ నటి. శృంగార తారగా వెలుగువెలిగిన ఆమె బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించింది. ఐటమ్ సాంగ్‌కు రూ.6 కోట్ల వరకు తీసుకుంటోంది. ఆమె తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడవేగ సినిమాలోను ఐటమ్ గర్ల్‌గా మెప్పించింది. బాలీవుడ్‌తో పోల్చుకుంటే తెలుగు పరిశ్రమ పరిధి చిన్నదైయినప్పటికీ ఇక్కడ కూడా ఆమెకు భారీగానే ముట్టింది.


Click it and Unblock the Notifications