వేతనం తక్కువుందా... ఐతే సూపర్ లోన్ ఆఫర్, తక్కువ వడ్డీ!

హైదరాబాద్: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) వివిఫై ఫైనాన్స్ ఫ్రైవేట్ లిమిటెడ్ (Vivifi) ఫ్లెక్స్ శాలరీ (FlexSalary) ద్వారా రూ.100 కోట్ల రుణాల్ని పంపిణీ చేసింది. ఫ్లెక్స్ శాలరీ అనేది ఎమర్జెన్సీ సమయంలో ఆన్‌లైన్ పర్సనల్ లోన్ వ్యవస్థ. స్వల్పకాలికంగా నగదు ఇబ్బందులను దూరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎంతోమందికి డబ్బులు అవసరం పడుతాయి. అలాంటప్పుడు చేతిలో డబ్బు ఉండదు. అలాంటి వారికి ఫ్లెక్స్ శాలరీ సులభంగా రుణం ఇస్తోంది. బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణం అందుబాటులో ఉన్నప్పటికీ అది పెద్ద మొత్తంలో ఎక్కువకాలం పాటు ఉంటుంది.

రూ.2 లక్షల వరకు సులభ రుణం

రూ.2 లక్షల వరకు సులభ రుణం

తెలంగాణ బేస్డ్ ఫిన్‌టెక్ స్టార్టప్ రెండేళ్ల తక్కువ వ్యవధిలో వేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు రూ.100 కోట్ల రుణాలు ఇచ్చింది. 35,000 కంటే ఎక్కువ రుణాలను అప్రూవ్ చేసింది. యూనిక్ ఫీచర్స్, ఇన్‌స్టాంట్ లోన్ మంజూరు చేస్తోంది. సింపుల్ ఆన్‌లైన్ వన్ టైమ్ అప్రూవల్ ప్రాసెస్‌తో వ్యక్తులు ఎంత కాలమైనా ఫ్లెక్స్ శాలరీ రుణాలను రూ.2 లక్షల వరకు పొందవచ్చు.

ఫ్లెక్స్ శాలరీ...

ఫ్లెక్స్ శాలరీ...

స్వల్పకాలిక అవసరాలకు అప్పు అవసరాలు తీర్చే స్టార్టప్ ఫ్లెక్స్ శాలరీ డాట్ కామ్. నెల మధ్యలో డబ్బు అవసరమైన వారికి తక్షణ రుణ సదుపాయం కల్పిస్తుంది. వివిఫై ఇండియా సీఈవో అండ్ సహ వ్యవస్థాపకులు అనిల్ పినపాల మాట్లాడుతూ.. రూ.100 కోట్ల మైల్ స్టోన్ చేరుకోవడం ఆనందంగా ఉందని, అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యే శాలరైడ్ ఇండివిడ్యువల్స్‌కు ఫ్లెక్స్ శాలరీ ఎంతో ప్రయోజనకరమన్నారు. ఈ ఉత్పత్తి కస్టమర్ కేంద్రంగా డిజైన్ చేయబడిందన్నారు. మెరుగైన సేవలతో వారిని సంతోషాన్ని నింపుతామన్నారు.

కస్టమర్లకు అనుకూలంగా...

కస్టమర్లకు అనుకూలంగా...

కస్టమర్లకు ఇది ఆమోదయోగ్యంగా ఉందని, ఫలితంగా వృద్ధి వేగవంతమవుతోందని ఆయన చెప్పారు. ఫ్లెక్స్ శాలరీ యాప్ 5 లక్షలు దాటిందన్నారు. నెలలో 70,000కు పైగా లోన్ అప్లికేషన్స్ కూడా వచ్చాయని, రుణగ్రహీతల్లో 97 శాతం మంది తమ క్రెడిట్ లైన్‌ను చురుగ్గా ఉపయోగిస్తున్నారని చెప్పారు. తక్షణ ఆర్థిక సాయం కోరుకునే వ్యక్తులకు ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడం చాలా ముఖ్యమని చెప్పారు.

ప్లెక్స్ శాలరీ కస్టమర్ సేవ, సంతృప్తి, కార్యాచరణ ప్రమాణాలతో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తోందని, ఇది సంస్థను తదుపరి స్థానానికి తీసుకు వెళ్తుందన్నారు.

వేతన జీవుల అవసరాలు...

వేతన జీవుల అవసరాలు...

ఈ సంస్థ సీఈవో అనిల్ పినపాల హైదరాబాదులో కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ కూడా పని చేశారు. అనంతరం సొంత వ్యాపారం చేయాలనే ఆలోచనతో దీర్ఘకాలిక రుణాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటాన్ని గమనించారు. దానిని వ్యాపారంగా మార్చుకోవాలని భావించారు. రుణ సదుపాయాల గురించి పూర్తిగా స్టడీ చేయగా.. వేతనజీవులకు నెల మధ్యలో అవసరాలు ఏర్పడుతాయని తేలింది.

షార్ట్ టర్మ్ ఆర్థిక అవసరాల సర్దుబాటు సంస్థ

షార్ట్ టర్మ్ ఆర్థిక అవసరాల సర్దుబాటు సంస్థ

వేతజీవులు మధ్యలోనే తమ స్నేహితులను, బంధువులను అడుగుతారని గుర్తించారు. దీంతో ఇలాంటి ఆర్థిక సేవల కోసం దీనిని ప్రారంభించారు. 2017 సెప్టెంబర్‌లో స్నేహితుడితో కలిసి వివిఫై ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. ఇందులోనిదే ఫ్లెక్స్ శాలరీ డాట్ కామ్. ఆర్బీఐ నుంచి NBFC లైసెన్స్ తీసుకున్నారు. దేశంలో తొలి షార్ట్ టర్మ్ ఆర్థిక అవసరాల సర్దుబాటు సంస్థ ఇదే కావడం గమనార్హం.

రుణం ఎలా తీసుకోవాలి..

రుణం ఎలా తీసుకోవాలి..

ఫ్లెక్స్ శాలరీ డాట్ కామ్‌లో రుణం తీసుకునే వారు తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉంది. దరఖాస్తులో మీ వివరాలు ఇవ్వాలి. అడ్రస్, ఐడెంటిడీ, పని చేస్తున్న కంపెనీ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అడిగిన సమాచారం ఇస్తే నిమిషాల్లో రుణం ఇస్తారు.

ఎంత రుణం ఇస్తారు

ఎంత రుణం ఇస్తారు

రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఎంత ఇస్తారనేది ఉంటుంది. ఆదాయం, ఇతర పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఫ్లెక్స్ శాలరీ డాట్ కామ్ మెషిన్ లెర్నింగ్ ప్లాట్ ఫాంలు ఎంత మేర రుణం ఇవ్వచ్చునో చెబుతాయి.

తక్కువ తీసుకోవచ్చు...

తక్కువ తీసుకోవచ్చు...

రుణం ఎంత వస్తుందో తెలిసిన తర్వాత కూడా మనకు అవసరమైన మేరకే తీసుకోవచ్చు. ఎక్కువ రాదు కానీ తక్కువ తీసుకోవచ్చు. సంస్థ ఏజెంట్ వచ్చి డాక్యుమెంట్స్ తీసుకుంటారు. రూ.4,000 నుంచి రూ.2,00,000 వరకు అప్పు ఇస్తుంది. ఒక రోజు నుంచి మూడేళ్ల వరకు వ్యవధికి అప్పు తీసుకునే అవకాశముంది. తక్కువ వేతనం ఉండి అత్యవసరాల్లో బ్యాంకుల నుంచి ఇబ్బంది పడుతున్న వారికి ఇది ప్రయోజనం.

చార్జ్ ఎంత ఉంటుంది..

చార్జ్ ఎంత ఉంటుంది..

రుణం తీసుకునే వారికి పరిశీలనా రుసుము కింద రూ.675 వసూలు చేస్తారు. దీనిని ఒకేసారి చెల్లించాలి. మొదటిసారి చెల్లించాక.. ఆ తర్వాత ఎన్నిసార్లు రుణం తీసుకున్నా దీనికి ఫీజు ఉండదు. ఆప్పుపై వడ్డీ రూపంలో వసూలు చేస్తారు. నెలకు రూ.3 నుంచి వడ్డీ పడుతుంది. ఎవరైనా రూ.10వేలు తీసుకుంటే రోజుకు రూ.10 చొప్పున వడ్డీ వేస్తారు. ఎన్ని రోజుల్లో అప్పు తీరిస్తే అన్ని రోజులు రూ.10 పడుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+