స్టార్టప్ ఫౌండర్ల నయా అడ్డా.. అమెరికా!: బీ2బి వలసబాట

అమెరికా...! అదో కలల ప్రపంచం. అక్కడ ఉద్యోగం చేయాలనో... బిజినెస్ పెట్టాలనో కలలు కనే భారతీయులు ఎందరో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అని లక్షలాది ఇండియన్స్ అమెరికా లో సెటిల్ అయ్యారు. పై చదువుల కోసం అమెరికా వెళ్లిన వారు అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడిపోయి డాలర్లు వెనకేసుకొన్నారు. అయితే, డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఐన తర్వాత అమెరికా ప్రయాణం అంటేనే అతి కష్టం అయిపోయింది. ఉద్యోగులకు వీసాలు మంజూరు చేయడం లేదు. ఆల్రెడీ ఉన్న వారికీ సిటిజెన్షిప్ ఇవ్వడం లేదు. ఇటీవల మరో అడుగు ముందుకు వేసి జన్మతః అక్కడే పుట్టినా కూడా పౌరసత్వం ఇవ్వొద్దంటూ కొత్త పల్లవి అందుకొన్నాడు. దీంతో అమెరికా కలలకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. కానీ ... ఒక రంగంలో మాత్రం వలసలు పెరుగుతున్నాయి. అదే.... స్టార్టుప్ కంపెనీలు.... వాటి ఫౌండర్లు. మూడు, నాలుగేళ్లలో భారత్ నుంచి తమ బేస్ ను అమెరికాకు... ముఖ్యంగా సిలికాన్ వాలీకి మార్చిన స్టార్టుప్ కంపెనీలు, వాటి ఓనర్ల లిస్ట్ పెద్దది అవుతోంది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో వెల్లడించింది. ఆ కథ కమామీషు ఏమిటో చూద్దామా మరి?

ఊరిస్తున్న అతి పెద్ద మార్కెట్...

ఊరిస్తున్న అతి పెద్ద మార్కెట్...

సహజంగానే అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ. కొనుగోలు శక్తిలో ఆ దేశాన్ని మించిన మార్కెట్ మరోటి లేదు. అందుకే ప్రపంచ దేశాలన్నీ అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఉవ్విల్లూరుతై. ఎందుకంటే నాణ్యమైన ఉత్పత్తులకు అధిక ధరను చెల్లించే మార్కెట్ కూడా అమెరికానే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం తయారు చేసే మూడో వంతు వస్తువులు, సేవలను కొనేసి మార్కెట్ అమెరికా. అందుకే అది అంత ఆకర్షణీయం. ఈ విషయాన్నీ గుర్తించిన భారత స్టార్టుప్ కంపెనీలు అమెరికా లో తమ జెండా ఎగురవేసే పనిలో పడ్డాయి. అయితే, భారత్ లో ఉంటూ అక్కడి మార్కెట్ ను అంచనా వేయడం, లేదా అమెరికా కస్టమర్ల అవసరాలను గుర్తించటం అంత సులువు కాదు కాబట్టి, ఏకంగా తమ మకాం అక్కడికే మారిస్తే బెటర్ అని స్టార్టుప్ ఫౌండర్లు ఆలోచిస్తున్నారు. అనుకోవడమే కాదు ... దానిని ఆచరణలో పెడుతున్నారు. అయితే, డేటా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, బి 2 బి రంగం లోని స్టార్టుప్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) మోడల్ లో పనిచేసే కంపెనీలు, ఇంటర్ప్రైజ్ సాఫ్ట్ వేర్ సంస్థలు అధికంగా తమ బేస్ ను అమెరికాకు షిఫ్ట్ చేస్తున్నాయి. ఒక్క సైబర్ సెక్యూరిటీ రంగంలోనే అమెరికా లో 135 బిలియన్ డాలర్ల (సుమారు రూ 9,45,000 కోట్లు ) మార్కెట్ అందుబాటులో ఉంది. ఈ విషయం లో ప్రపంచం మొత్తం మార్కెట్లో ఒక్క అమెరికాదే 40% వాటా కావడం విశేషం. అందుకే, ఈ రంగంలో పని చేస్తున్న మన కంపెనీలు అక్కడే వేట ప్రారంభించాయి.

అధిక చెల్లింపు సామర్థ్యం.....

అధిక చెల్లింపు సామర్థ్యం.....

ఒక ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం మిగితా దేశాలతో పోల్చితే అమెరికా లో కంపెనీలు, కస్టమర్లు చెల్లించే మొత్తం చాల అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా లోని కంపెనీలు ఉత్పత్తి నాణ్యతకు, గోప్యతకు పెద్ద పీఠ వేస్తాయంటారు. అందుకే, మన స్టార్టుప్ కంపెనీలు ఫార్చ్యూన్ 1,000 కంపెనీలను తమ కస్టమర్లుగా సంపాదించేందుకు అక్కడికే పయనమవుతున్నాయి. అమెరికా లో గెలిస్తే... ఇక ఎక్కడైనా గెలవొచ్చు అనే ధోరణి కూడా ఇందుకు దోహదం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లుసిడ్యూస్, యూనిఫార్, క్లౌడ్ చెర్రీ, ధ్రువ, ఫ్రెషవర్క్స్, జీనియర్, మైండ్ టికిల్, జెనోటి, క్లేవోర్ టాప్, హెల్ప్ షిఫ్ట్ వంటి భారతీయ స్టార్టుప్ కంపెనీలు ఇప్పటికే అమెరికాకు రెండో ఇల్లుగా మార్చుకొన్నాయని ది ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ కంపెనీల ఫౌండర్లు చాలా మంది సిలికాన్ వాలీ లో నివాసం ఏర్పరచుకొన్నారని తెలిపింది.

సహకరిస్తున్న భారత మూలాలు...

సహకరిస్తున్న భారత మూలాలు...

మూడు, నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా లో సెటిల్ ఐన భారత టెక్నాక్రాట్లు ఇప్పుడు అక్కడి కంపెనీలకు బాస్ లు గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ , పే పాల్, అడోబీ, మాస్టర్ కార్డు వంటి కంపెనీల సీఈఓ లే ఇందుకు నిదర్శనం. అలాగే ఇంకా చాల కంపెనీల్లో మన భారతీయులు అతి పెద్ద హోదాల్లో పనిచేస్తున్నారు. భారతీయ మూలాలు ఉన్న అధికారులతో మన స్టార్టుప్ కంపెనీల ఫౌండర్లు కలవడం ఈజీ అవుతోంది. ఈ కంపెనీల ఉత్పత్తులను అర్థం చూసుకోవడం లో ... అలాగే ఫౌండర్ లక్షలను అంచనా వేయడంలో వారికీ భారతీయ మూలాలు సహరిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే కాకుండా ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకెర్బెర్గ్ వంటి దిగ్గజాలను కూడా సామాన్య పౌరుల వాలే కలిసే అద్భుతమైన అవకాశం సిలికాన్ వాలీ లో లభిస్తుందని.. అందుకే, మన స్టార్టుప్ ఫౌండర్లు అమెరికాకు జై కొడుతున్నారని అనలిస్టులు పేర్కొంటున్నారు.

పెట్టుబడులు ఈజీ...

పెట్టుబడులు ఈజీ...

సరైన స్టార్టుప్ ఐడియా ఉంటె.. సిలికాన్ వాలీ నుంచి పెట్టుబడులు సమీకరించటం చాలా ఈజీ అని చెబుతారు. అక్కడి పెట్టుబడి కంపెనీలు చాలా త్వరగా నిధులను అందిస్తాయని పేర్కొంటున్నారు. అగ్రీమెంట్లు, కాంట్రాక్టు లు సైతం చాల పారదర్శకంగా ... ముఖ్యంగా చాలా సరళంగా ఉంటాయని అంటారు. ఒక స్టార్టుప్ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు భారత్ లో అయితే ఒక టర్మ్ షీట్ 15-20 పేజీల్లో చాలా నిబంధలతో కూడిన కఠినమైన పదాలతో ఉంటుంది. అదే అమెరికాలో కేవలం 1 పేజీ లోనే టర్మ్ షీట్ అగ్రిమెంట్ ఉంటుందట. కేవలం 45 రోజుల్లో పెట్టుబడి సంస్థలు నిధులను స్టార్టుప్ కంపెనీ కథకు బదిలీ చేస్తాయట. అందుకే, అమెరికా అంత ఆకర్షణీయం అని నిపుణులు చెబుతున్నారు. దేశం ఏదైతే ఏంటి ... మన వారు వృద్ధిలోకి వస్తే.... అది మనకు మన ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేదే కదా? అక్కడి నిధులతో పైకి వచ్చి మన దేశంలో ఈ స్టార్టప్ లు మరింత విస్తరిస్తే మన వారికీ ఉద్యోగాలు వస్తాయి కదా. సో, జై భారత్... జై అమెరికా!

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+