ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇదీ.. రూ.12వేలకోట్లు లోటు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు. ఇప్పటికే మద్యం అమ్మకాలతో పాటు సిమెంట్, స్టీల్ వంటి వాటిలో క్షీణత కారణంగా రెవెన్యూ పైన ప్రభావం పడింది. ఇటీవల పాలన అనంతరం ఖర్చులను పరిగణలోకి తీసుకున్న తర్వాత రూ.12,220 కోట్ల లోటు ఉంటుందని అంచనాకు వచ్చారు. దీంతో రుణ సమీకరణ మంచి మార్గమని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రతి నెల సగటు ఆదాయం, ఖర్చు ఎంత అనే అంశాలను లెక్కించి, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు ప్రత్యేకంగా ఉన్న ఖర్చులను పరిగణలోకి తీసుకొని, ఎంత లోటు ఉంటుందో లెక్కించారు. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం...

ఆదాయం రూ.11,500 కోట్లు
రాష్ట్రానికి సగటున నెలకు వచ్చే ఆదాయం రూ.8,500 కోట్లుగా లెక్కగట్టారు. నెలకు సగటున తీసుకుంటున్న రుణం రూ.3,000 కోట్లుగా ఉంది. వీటి ద్వారా సమకూరుతున్న నిధులు రూ.11,500 కోట్లుగా ఉంది. అయితే ఇలా వస్తున్న ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉందని లెక్కలు వేశారు.

అదనపు ఖర్చులు...
నెలకు సగటున అయ్యే వ్యయం రూ.10,000 కోట్లు. సెప్టెంబర్ నెలలో పథకాలు, అదనపు ఖర్చుల కోసం రూ.8,600 కోట్లు కానున్నాయి. అలాగే అక్టోబర్ నెలలో రూ.6,600 కోట్లు అవసరం పడనున్నాయి. అంటే మొత్తం రూ.25వేల కోట్లకు పైగా ఖర్చు కానుంది.

లోటు రూ.12,200 కోట్లు
నెలకు సమకూరేది రూ.11,500 కోట్లు.. రెండు నెలలకు రూ.23,000 కోట్లు వరకు వస్తుంది. అలాగే, ఖర్చు విషయానికి వస్తే సగటున నెలకు రూ.10,000 కోట్లు అంటే రెండు నెలలకు రూ.20,000 కోట్లు. అదనపు ఖర్చులు రూ.15,200 కోట్లు. అప్పుడు లోటు రూ.12,200 కోట్లు అవుతుంది.

ఖర్చులు ఇలా...
రూ.8,500 కోట్లు పన్నులు, పన్నేతర ఆదాయం వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాలు కూడా ఉంటాయి. రూ.3,000 కోట్లు రుణం. ఖర్చు విషయానికి వస్తే జీతాలు, పెన్షన్స్ రూ.5,000 కోట్లు, రుణాల తిరిగి చెల్లింపు రూ.2500 కోట్లు, సంక్షేమ పథకాల కోసం రూ.1250 కోట్లు, విద్యుత్ రాయితీలకు రూ.550 కోట్లు, బియ్యం సబ్సిడీ, ఆర్టీసీకి వరుసగా రూ.450,రూ.250 కోట్లు. వీటి ప్రకారం నెలకు ఆదాయం రూ.11,500 కోట్లు రాగా, ఖర్చులు రూ.10000 కోట్లుగా ఉంటుంది. దీంతో రూ.1500 కోట్లు మిగులు కనిపిస్తోంది.

అదనపు ఖర్చులు ఇలా..
కానీ సెప్టెంబర్, అక్టోబర్ నుంచి అదనపు ఖర్చు ఉంటుంది. పెట్టుబడి రాయితీ, టిట్లీ సాయం, పంట బీమా, ప్రాజెక్టులు, ఇతర పథకాలు, వాలంటీర్లకు సెప్టెంబర్ నెలలో రూ.8620 కోట్లు కానున్నాయి. అక్టోబర్ నెలలో రైతు భరోసా, స్మార్ట్ సిటీలు, గ్రామ వాలంటీర్లకు రూ.6600 కోట్లు అదనంగా అవసరం.


Click it and Unblock the Notifications