న్యూఢిల్లీ: భారత దేశ ఆర్థిక వ్యవస్థపై మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ మన్మోహన్ సింగ్ ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పని తీరు కారణమని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లోను మిస్‌మేనేజ్‌మెంట్ కారణంగా జీడీపీ వ్యవస్థ 5 శాతానికి పడిపోయిందని విమర్శించారు. అలాగే, ఆర్థిక వ్యవస్థ మందగించిందని, వివిధ రంగాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు.

5 శాతం పై మన్మోహన్ స్పందన
భారత ఆర్థిక వ్యవస్థ గత ఆరేళ్లలో మొదటిసారి నెమ్మదించిందని రెండు రోజుల క్రితం ప్రభుత్వ డేటా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరంలోని తొలి క్వార్టర్‌లో జీడీపీ 5 శాతంగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.8 శాతంగా ఉంది. జూన్ 30 2018 క్వార్టర్ (అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో) 8.0 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ స్పందించారు.

ఇంకా బయటపడలేదని
ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ అసమర్థ నిర్వహణ వల్ల ఈ దుస్థితి తలెత్తిందని మన్మోహన్ అన్నారు. ఉత్పాదక రంగం 0.6 శాతానికి పడిపోవడం తీవ్ర విచారం కలిగించే అంశమన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో లోపాల ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదని, దీనికి ఆర్థిక వ్యవస్థ మందగించడమే నిదర్శనం అన్నారు.

అన్ని రంగాలు దారుణంగా...
ఎన్డీయే హయాంలో నిరుద్యోగం పెరిగిందని మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. వాహన రంగంలోనే 3.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. అసంఘటిత రంగంలోను పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది ఉపాది కోల్పోయారన్నారు.

దుర్బర పరిస్థితులు...
దేశీయ వినిమయంతగ్గిందని, వినియోగ వృద్ధి రేటు పద్దెనిమిది నెలల కనిష్టానికి పడిపోయిందని మన్మోహన్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఆదాయం బాగా పెరగడంతో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజలు దుర్బర పరిస్థితులు చవి చూస్తున్నారన్నారు.

సంప్రదించండి...
ఈ ఆర్థిక మందగమనం మంచిది కాదని, ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు పక్కన పెట్టి, వివేకవంతమైన మార్గంలో నడవాలని మన్మోహన్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు మేధావులను, నిపుణులను సంప్రదించాలన్నారు. ఆర్థిక వృద్ధి పరుగు పెట్టాలంటే ఇదే మార్గం అన్నారు. గత త్రైమాసికంలో 5 శాతం జీడీపీ అంటే మనం తీవ్ర మందగమనంలో ఉన్నామని అర్థమని చెప్పారు. యువత, రైతాంగం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. అన్ని రంగాల వారికి ప్రభుత్వం ఇంకా ఎంతో చేయాలన్నారు.

ఆర్బీఐ నిధుల బదలీపై ఆక్షేపణ
చట్టబద్ద సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని మన్మోహన్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.1.76 కోట్ల నిధులను బదలీ చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. బడ్జెట్ ప్రకటనలు, పథకాల అమలు తీరు విదేశీ ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. భౌగోళిక రాజకీయ కారణాలతో ఇంటర్నేషనల్‌లో పెరిగిన ఎగుమతుల అవకాశాలను ఒడిసిపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications