బజాజ్ ఫిన్ సర్వ్ గ్రూప్ నకు చెందిన బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) కోసం కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా గరిష్టంగా 8.95 శాతం వరకు రిటర్న్ ను పొందవచ్చని చెబుతోంది. అంతే కాకుండా సులభమైన కాల పరిమితులను కూడా ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా డిపాజిట్ల కాలపరిమితి 12 నెలల నుంచి 36 నెలల వరకు ఉంటుంది. మల్టీ డిపాజిట్, ఈజీ రెన్యూవల్ సదుపాయాలను అందిస్తోంది. ఇలాంటి వాటిలో ఎన్ఆర్ఐలు చాలా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చని కంపెనీ చెబుతోంది.
భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక రిటర్న్ ను ఆశించే వారిని దృష్టిలో ఉంచుకొని ఈ డిపాజిట్ పథకాన్ని తెచ్చినట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో పెట్టుబడులకు భద్రత ఉంటుందని, రెగ్యులేటరీ పరమైన వాతా వరణం కూడా బాగుందని అంటున్నారు.

అధిక వడ్డీ రేటు
* మార్కెట్ హెచ్చుతగ్గులతో సంభందం లేకుండా తమ ఫిక్స్డ్ డిపాజిట్ పై అధిక రిటర్న్ ను అందిస్తున్నట్టు బజాజ్ ఫైనాన్స్ చెబుతోంది.
* క్యుములెటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో 36 నెలల పా టు ఎన్ ఆర్ ఐ లు పెట్టుబడి పెడితే 8.60 శాతం వరకువడ్డీ రేటు పొందవచ్చని చెబుతోంది.
* సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.85 శాతం నుంచి 8. 95 శాతం వరకు ఉంటుందని అంటోంది.
* బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కు క్రిసిల్ నుంచి అత్యంత స్థిరత్వం తో కూడిన ఎఫ్ఏఏఏ, ఇక్రా నుంచి ఎంఏఏఏ రేటింగ్స్ లభించినట్టు చెబుతోంది.
* ఈ రేటింగ్స్ పెట్టుబడులకు అత్యంత భద్రతను సూచిస్తాయని పేర్కొంది.
* ఎన్ ఆర్ ఐ లు ఏడాది నుంచి 3 ఏళ్ల కాలానికి డిపాజిట్ కాల పరిమితిని ఎంచుకోవచ్చు.
* పెట్టుబడులు ప్రారంభించడానికి ముందే తమకు ఎంత రిటర్న్ వస్తుందో లెక్క వేసుకునే సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.
* ఇన్వెస్టర్లు తమ నచ్చిన కాల పరిమితి, సౌకర్యాన్ని బట్టి పెట్టుబడి పెట్టే ఆలోచన చేయవచ్చు.

మల్టీ డిపాజిట్ సదుపాయం
* ఇక కాలంలో బహుళ ఎన్ ఆర్ ఐ ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా ఎంచుకోవచ్చని ఇందుకు సింగిల్ చెక్ ను వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
* మల్టీ డిపాజిట్ సదుపాయం వల్ల వేర్వేరుగా అప్లికేషన్లను నింపాల్సిన అవసరం ఉండదు. వేర్వేరుగా చెల్లింపులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉన్న వారు ఈ కంపెనీ అఫర్ చేస్తున్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవచ్చు.
* ఫిక్స్డ్ డిపాజిట్లపై ఉండే పన్నులు తదితర పూర్తి వివరాలు కంపెనీ వెబ్ సైట్ ద్వారా కూడా పొందవచ్చు.

భారత్ కు భారీగా ప్రవాసుల సొమ్ము
* ప్ర వాసులు విదేశాల నుంచి మనదేశానికి భారీ మొత్తంలో సొమ్మును పంపుతున్నారు.
* ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2018 సంవత్సరంలో ప్రవాస భారతీయులు పంపిన సొమ్ము 7,900 కోట్ల డాలర్లుగా ఉంది.
* ఇప్పటిదాకా చూస్తే ఎన్ ఆర్ ఓ ఖాతాల్లో 80,000 కోట్ల రూపాయలున్నాయి. వీటిపై సేవింగ్స్ ఖాతా నిల్వల మాదిరిగా చాలా తక్కువ వడ్డీ రేటు లభిస్తోంది.
* అయితే పెట్టుబడులకు భద్రత, సుస్థిర రాబడులను ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎన్ ఆర్ ఐ లు ద్రుష్టి సారిస్తే వారికీ ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications