న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు కీలక అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మాంద్యం తాత్కాలికమేనని అభిప్రాయపడింది. వ్యవస్థలో వినియోగాన్ని, ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం, పాలకులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఇందుకు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ రంగాలను బలోపేతం చేయాలని, అలాగే మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని, భూసేకరణ, పన్నులు, కార్మిక, వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలు సంస్కరించాలని తెలిపింది.

మాంద్యం తాత్కాలికమే...
ఆర్థిక వృద్ధి మందగమనానికి కచ్చితమైన కారణం ఏదో చెప్పడం కష్టమని, కానీ ఇది వ్యవస్థాగత సమస్య మాత్రం కాదని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ప్రస్తుత మందగమనం అప్పుడప్పుడు వచ్చే స్వల్పకాలిక పరిమాణంగానే కనిపిస్తోందని తెలిపింది. నెలలో ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధిని 6.9 శాతానికి తగ్గించింది. వరుసగా నాలుగు పర్యాయాలు రెపో రేట్లు తగ్గించి, 9 ఏళ్ల కనిష్ట స్థాయి 5.4కు చేరుకుంది.

తగ్గిన ఎన్పీఏల శాతం
దేశీయ బ్యంకింగ్ రంగంలో ఎన్పీఏలు తగ్గుముఖం పట్టినట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతానికి తగ్గిందని, అంతకుముందు ఏడాది ఇది 11.2 శాతంగా ఉందని తెలిపింది. ఎన్పీఏల కోసం బ్యాంకుల నిధుల కేటాయింపు నిష్పత్తి కూడా 60.9 శాతానికి పుంజుకున్నట్లు తెలిపింది. మొండి పద్దుల రికవరీ, కేంద్రం మూలధన కేటాయింపుల కారణంగా బ్యాంకుల వద్ద మూలధన నిల్వలు కూడా రూ.2.7 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.

రూ.100 నోటుకు వార్నిష్ కోటింగ్
రూ.100 నోట్లు ఇక నుంచి మెరవనున్నాయి. ఈ నోట్ల మన్నిక కోసం ఆర్బీఐ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. రూ.100 నోట్ల పైన ప్రయోగాత్మకంగా వార్నిష్ కోటింగ్ వేయనున్నట్లు వార్షిక నివేదికలో తెలిపింది. వార్నిష్ కారణంగా రూ.100 నోట్లు మెరుపును సంతరించుకుంటాయని తెలిపింది. దృష్టిలోపం ఉన్న వారికి కూడా కరెన్సీ నోట్లను దగ్గర చేయాలని చూస్తోంది.

ప్రింటింగ్ ఖర్చు అధికమే...
కరెన్సీ ప్రింటింగ్‌కు భారీగానే ఖర్చు అవుతోంది. జూలై 1, 2018 మరియు జూన్ 30, 2019 మధ్య ఆర్బీఐ కరెన్సీ ప్రింటింగ్ కోసం రూ.48.11 బిలియన్లు ఖర్చు అయింది. అయితే అంతకుముందు ఏడాది కంటే మాత్రం (రూ. 48.11 బిలియన్లు) తక్కువే.

సోషల్ మీడియాలోకి ఆర్బీఐ
ఆర్బీఐ సోషల్ మీడియా ద్వారా యువతకు చేరువ అయ్యేందుకు సిద్ధమవుతోంది. తన పనితీరు, విధానాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళేందుకు, వారి అభిప్రాయాల్ని తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ల్లో చేరనుంది.

వాణిజ్య రుణాలు 20 శాతం తగ్గాయి...
IL&FS గ్రూప్ వల్ల వచ్చిన ప్రతికూలత కారణంగా వాణిజ్య రంగనికి బ్యాంకింగేతర రుణదాతల నుంచి వచ్చే రుణాలు 20 శాతం తగ్గాయి. 2018-19లో NBFCల నుంచి వాణిజ్య రుణాలు రూ.11.60 లక్షల నుంచి రూ.9.34 లక్షల కోట్లకు తగ్గాయి. ఈ క్షీణత ఈ ఆర్థిక సంవత్సరంలోను కొనసాగింది. జూన్ 30వ తేదీ నాటికి ఆర్బీఐ నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గింది.

ఇవి ప్రతికూల ప్రభావం చూపాయి....
దేశీయ డిమాండ్ పరిస్థితులు ఊహించిన దాని కంటే బలహీనంగా ఉన్నాయని ఆర్బీఐ నివేదిక తెలిపింది. పునరుద్ధరణకు వ్యవస్థలో చర్యలు తీసుకోవాలని తెలిపింది. రైతు రుణమాఫీ, ఏడో వేత కమిషన్ నివేదిక అమలు, వివిధ ఆదాయ మద్దతు స్కీమ్స్ ఆర్థిక క్రమశిక్షణ పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. బ్యాంకు మోసాలు పెరిగాయి. ప్రైవేటు బ్యాంకులు, విదేశఈ బ్యాంకుల చీఫ్‌ల వేతనాల విషయంలో సవరించిన నిబంధనలు త్వరలో విడుదల చేయనున్నారు.

ఇవి ప్రతికూల ప్రభావం చూపాయి....
దేశీయ డిమాండ్ పరిస్థితులు ఊహించిన దాని కంటే బలహీనంగా ఉన్నాయని ఆర్బీఐ నివేదిక తెలిపింది. పునరుద్ధరణకు వ్యవస్థలో చర్యలు తీసుకోవాలని తెలిపింది. రైతు రుణమాఫీ, ఏడో వేత కమిషన్ నివేదిక అమలు, వివిధ ఆదాయ మద్దతు స్కీమ్స్ ఆర్థిక క్రమశిక్షణ పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. బ్యాంకు మోసాలు పెరిగాయి. ప్రైవేటు బ్యాంకులు, విదేశఈ బ్యాంకుల చీఫ్‌ల వేతనాల విషయంలో సవరించిన నిబంధనలు త్వరలో విడుదల చేయనున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications