సబ్బు లేనిదే రోజు గడవదు.. కొంత మంది మొహం కడిగిన ప్రతి సారి సబ్బును వినియోగిస్తుంటారు. మిగతావారు స్నానం చేసినప్పుడు తప్పనిసరిగా సబ్బును వాడుతుంటారు. సబ్బు నిత్యావసరం. ధర ఎంత ఉన్నప్పటికీ కొనడం తప్పనిసరి. దీని ప్రభావం ఇంటి బడ్జెట్ పై ఉంటుంది. ఇంట్లో ఉన్న వారందరూ ఒకే రకమైన సబ్బును వినియోగించాలని ఏమీ లేదు. కాబట్టి వేర్వేరు సబ్బులు కొంటె ఆమేరకు బడ్జెట్ పెరిగిపోతుంది. ఇక వర్షాకాలంలో సబ్బులు కరిగిపోతూనే ఉంటాయి. డిమాండ్ పెరిగే కొద్దీ కంపనీలు ధరలు పెంచుతాయి. దీంతో వినియోగదారులపై భారం పెరిగిపోయింది. కానీ ఇప్పుడు వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే కంపెనీలు తమ సబ్బుల ధరలను తగ్గించాయి. మన దేశంలో టాయిలెట్ సబ్బుల మార్కెట్ పరిమాణం రూ. 21,000 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా.

ధర ఎందుకు తగ్గిందంటే..
* ప్రముఖ సబ్బుల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించడానికి కారణం సబ్బుల్లో వినియోగించే పామ్ ఆయిల్ ధరలు తగ్గడమే. అంతేకాకుండా సబ్బుల విభాగంలో వృద్ధి అంతంత మాత్రంగా ఉంటోంది. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. పోటీ పెరగడం కూడా ధరలు సవరించడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఎఫ్ ఎం సి జీ ఉత్పత్తుల అమ్మకాలు కొంతకాలంగా తగ్గుతున్నాయి. వీటిలో సబ్బులు, సాల్టీ స్నాక్స్, బిస్కెట్లు, స్పైసెస్, టాయిలెట్ సోప్స్, ప్యాకేజ్డ్ టీ వంటివి కూడా ఉన్నాయి. వీటి అమ్మకాలను పెంచుకోవడానికి ధరలను సవరించక తప్పడం లేదు.

వివిధ రకాల సబ్బుల ధరలు...
* హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ బాగా ప్రాచుర్యం పొందిన లక్స్, లైఫ్ బాయ్, డౌ వంటి సబ్బుల ధరలు గత నెలలో తగ్గించింది.
* లక్స్, లైఫ్ బాయ్ సబ్బుల ధరలను ఈ కంపెనీ 4 శాతం నుంచి 6 శాతం వరకు తగ్గించింది. కొన్ని పాక్స్ పై ధర మరి కాస్త ఎక్కవ గానే ఉందట.
* విప్రో కన్స్యూమర్ కేర్ కూడా సంతూర్ సబ్బుల ధరలను తగ్గించింది.
* సబ్బుల ధరలను తగ్గించిన నేపథ్యంలో వినియోగం పెరగడానికి అవకాశం ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.
* ఐటీసీ కంపెనీ కూడా తన సబ్బుల ధరలను తగ్గించింది. ధరలను తగ్గించడం వల్ల అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీలు భావిస్తున్నాయి.

మందగమనం దెబ్బ
* దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం వల్ల అన్ని రంగాలపై ప్రభావం పడుతోంది. ఆటోమొబైల్, ఎఫ్ ఎం సీజీ తదితర రంగాలు అమ్మకాలు తగ్గడం తో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. విక్రయాలు క్షిణించడం వల్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించి వేస్తున్నాయి. ఈ మేరకు ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్న విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications