న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బ్యాంకుల విలీనంపై శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండగా, వాటిని 12కు కుదించారు. వారం రోజుల్లో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ రంగాల సంక్షోభం, ఎఫ్‌పీఐలపై సర్ఛార్జ్ కారణంగా మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిన నేపథ్యంలో ఆమె గత శుక్రవారం మీడియా ముందుకు వచ్చి అందరికీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. తాజాగా, ఈ శుక్రవారం సాయంత్రం ఆమె బ్యాంకుల విలీనంపై ప్రకటన చేశారు. నిర్మలా ఏం చెప్పారంటే....
Aug 30, 2019, 5:04 pm IST
- విలీనం తర్వాత అతిపెద్ద బ్యాంకుగా SBI, రెండో అతిపెద్ద బ్యాంకుగా PNB కానుంది.
Aug 30, 2019, 5:00 pm IST
- వారసత్వ ప్రణాళిక కోసం, వ్యక్తిగత అభివృద్ధి ప్రణాళికల వ్యవస్థ రూపొందించేందుకు బోర్డులు.
Aug 30, 2019, 5:00 pm IST
- రుణాలు, ఎక్స్పోజర్స్ తెలుసుకునేందుకు చీఫ్ రిస్క్ ఆఫీసర్లను బ్యాంకులు నియమించుకుంటాయి.
Aug 30, 2019, 4:59 pm IST
- జనరల్ మేనేజర్ స్థాయి, అంతకంటే పై-అధికారుల పని తీరును అంచనా వేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డు కమిటీ.
Aug 30, 2019, 4:59 pm IST
- PSB బ్యాంకులలో పలు సంస్కరణలు చేపడతామని నిర్మల చెప్పారు.
Aug 30, 2019, 4:57 pm IST
- బ్యాంకులు ఇచ్చే రుణాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు.
Aug 30, 2019, 4:57 pm IST
- బ్యాంకింగ్ రంగంలో ఆధునాతన సాంకేతికతను వినియోగిస్తాం.
Aug 30, 2019, 4:56 pm IST
- బ్యాంకులు రూ.లక్షా 20వేల కోట్ల మొండి బకాయిలు వసూలు చేశాయి.
Aug 30, 2019, 4:56 pm IST
- ఇప్పటి వరకు 27 పీఎస్‌యూ బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విలీనంతో 12 బ్యాంకులుగా ఉండనున్నాయి.
Aug 30, 2019, 4:55 pm IST
- ఆంధ్రాబ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు, యూబీఐ బ్యాంకుల కలయికతో అయిదో అతిపెద్ద బ్యాంకుగా మారనుంది.
Aug 30, 2019, 4:54 pm IST
- PNB, OBC, యునైటెడ్ బ్యాంకుల కలిసిపోయిన తర్వాత రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏర్పడుతుంది. ఈ బ్యాంకు రూ.17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
Aug 30, 2019, 4:50 pm IST
- వివిధ బ్యాంకులను విలీనం చేసిన అనంతరం ఇప్పుడు భారత్‌లో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి.
Aug 30, 2019, 4:49 pm IST
- మొత్తం పది పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేశారు... విలీనం ఇలా...
PNB + OBC + United Bank......
Canara Bank + Syndicate......
Union Bank + Andhra Bank + Corporation Bank......
Indian Bank + Allahabad Bank
Aug 30, 2019, 4:48 pm IST
- యూనియన్ బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
Aug 30, 2019, 4:40 pm IST
- ఇండియన్ బ్యాంకును అలహాబాద్ బ్యాంకుతో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
Aug 30, 2019, 4:39 pm IST
- సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకుతో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ కూడా దక్షిణాదిలోనే ఉన్నాయి. విలీనం వల్ల ఇది థర్డ్ లార్జెస్ట్ పీఎస్‌యూ బ్యాంక్ అవుతుంది.
Aug 30, 2019, 4:39 pm IST
- ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
Aug 30, 2019, 4:36 pm IST
- రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతిని సాధించాయి.
Aug 30, 2019, 4:31 pm IST
- సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలి.
Aug 30, 2019, 4:31 pm IST
- NBFCలకు అండగా ఉంటాం.
Aug 30, 2019, 4:31 pm IST
- గ్రాస్ ఎన్పీఏలు తగ్గాయి. అసెట్స్ క్వాలిటీ పెరిగింది.
Aug 30, 2019, 4:31 pm IST
- గృహ, వాహనాల, తనఖా రుణాలను 8 ప్రభుత్వ బ్యాంకులు ప్రారంభించాయి. ఈ బ్యాంకులు రెపో రేటు లింక్డ్ లోన్లను ప్రారంభించాయి.
Aug 30, 2019, 4:30 pm IST
- భారత్ ఆర్థిక బలోపేతం కోసం, బ్యాంకులను బలోపేతం చేసేందుకు మరిన్ని సంస్కరణలు చేపడతామన్నారు. బ్యాంకింగ్ రంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నాం
Aug 30, 2019, 4:26 pm IST
- భారత్ ఆర్థిక బలోపేతం కోసం, బ్యాంకులను బలోపేతం చేసేందుకు మరిన్ని సంస్కరణలు చేపడతామన్నారు. బ్యాంకింగ్ రంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నాం
Aug 30, 2019, 4:26 pm IST
- రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్షిస్తాయన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు.
Aug 30, 2019, 4:26 pm IST
- భారత్‌ను 5 ట్రిలియన్ల బడ్జెట్ కలిగిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.