బ్యాంకుల్లో మీ మినిమం బ్యాలెన్స్‌పై త్వరలో గుడ్‌న్యూస్
ఆయా బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ (కనీస నగదు) ఉండాలి. ఇది లేకుంటే బ్యాంకులు ఫైన్ విధిస్తాయి. మినిమం బ్యాలెన్స్ ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంది. అలాగే, పట్టణ, గ్రామీణ, నగరాలను బట్టి ఆయా బ్యాంకుల్లో కనీస నగదులో మార్పులు ఉంటాయి. ఉదాహరణకు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కనీసం రూ.1.000గా ఉంటే ప్రైవేటు బ్యాంకుల్లో రూ.10,000 వరకు కూడా ఉన్నాయి. అదే విధంగా పట్టణాల్లో రూ.10,000 ఉంటే గ్రామీణస్థాయికి వెళ్లేసరికి రూ.2,500 మినిమం బ్యాలెన్స్ తగ్గుతుంది. బ్యాంకులు, ప్రాంతాలను బట్టి ఈ అమౌంట్ ఉంటుంది. అయితే దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సవరించే అవకాశాలు ఉన్నాయి.

మినిమం బ్యాలెన్స్, పెనాల్టీ తగ్గిస్తుందా?
బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అంశంపై సమీక్ష నిర్వహిస్తామని ఆర్బీఐ గురువారం తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అలాగే మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఆయా బ్యాంకులు విధించే పెనాల్టీని కూడా సమీక్షిస్తామని తెలిపింది. మినిమం బ్యాలెన్స్ లేకుంటే విధించే పైన్ ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉంది. వీటిని ఆర్బీఐ తగ్గించే అవకాశాలు ఉండవచ్చు.

ప్రస్తుతం ఛార్జీలు ఇలా...
ముఖ్యంగా విదేశీ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు అత్యధికంగా రూ.600 వరకు విధిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం చాలా తక్కువ చార్జ్ వసూలు చేస్తాయి. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల ఆధారంగా అలాగే, ఆయా బ్యాంకులను బట్టి మినిమం బ్యాలెన్స్ నిబంధనలు ఉన్నాయి.

మినిమం బ్యాలెన్స్‌పై సమాచారం...
ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు బ్యాంకు ఖాతాదారుకు ఎస్సెమ్మెస్/ఈ-మెయిల్/లేఖ ద్వారా మినిమం బ్యాలెన్స్ గురించి బ్యాంకులు తెలియజేయాలి. అలాగే, మినిమం బ్యాలెన్స్ పునరుద్ధరణకు నెల రోజుల సమయం ఇవ్వాలి. నెలవారీ బ్యాలెన్స్ అవసరాన్ని మార్చినట్లయితే కస్టమర్‌కు తెలియజేయాలి.

BSBDA నిబంధనల సడలింపు...
బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్స్ (BSBDA) నిబంధనలను ఆర్బీఐ జూన్ 10వ తేదీన సడలించింది. ఇందులో నెలలో కనీసం నాలుగు ఉపసంహరణలు అనుమతించడం, ఏటీఎం లేదా ఏటీఎం కమ్ డెబిట్ కార్డు జారీ, డిపాజిట్ చేసే మొత్తం నెలలో ఎంతైనా ఉండవచ్చునని, అలాగే ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేయవచ్చునని తెలిపింది. డిపాజిట్ మొత్తం డిపాజిట్ సంఖ్యకు పరిమితి లేదు.

నో జరిమానా....
అలాగే, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY), BSBDA కింద తెరిచిన ఖాతాలకు కనీస నగదు నిల్వ లేకున్నప్పటికీ ఎలాంటి జరిమానా విధించవద్దు. అకౌంట్లలో కనీస మొత్తం లేనందుకు కస్టమర్లు గత మూడేళ్లలో బ్యాంకులకు చెల్లించిన మొత్తం రూ.10,000 కోట్లకు పైగా ఉంది. 18 పబ్లిక్ సెక్టార్స్ బ్యాంకుకు వచ్చిన మొత్తం రూ.6,155 అయితే నాలుగు పెద్ద ప్రైవేటు బ్యాంకులు రూ.3,567 కోట్లు వసూలు చేశాయి.


Click it and Unblock the Notifications