న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 5 శాతానికి పడిపోయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం వెల్లడించింది. గత ఆరేళ్లలో జీడీపీ ఇంతలా దిగజారడం ఇదే మొదటిసారి. అంతకుముందు క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి 5.8 శాతంగా ఉండగా, ఈ క్వార్టర్‌లో 5.6 నుంచి 5.7 వరకు ఉంటుందని అంచనా వేశారు. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో (2018-19 క్వార్టర్ 1) వృద్ధి 8 శాతంగా ఉంది. అప్పటితో పోలిస్తే 3 శాతం తగ్గింది.
జీడీపీ తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మందగించాయి. దీంతో జీడీపీ భారీగా తగ్గింది. వ్యవసాయం, ఫారెస్టీ అండ్ ఫిషింగ్, మైనింగ్ అండ్ క్వారియింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలు 2%, 2.7%, 0.6%, 5.7%, 5.9% వృద్ధిని మాత్రమే కనబరిచాయి. వ్యవసాయ రంగం కంటే ఆటో, మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ రంగాల ప్రభావమే జీడీపీ వృద్ధి రేటుపై ఎక్కువగా పడింది.

అంచనాలు తప్పాయి.. ఎవరెంత అంచనా వేశారంటే
కాగా, అంతకుముందు క్వార్టర్‌లో 5.8 శాతంగా ఉంది. ఈ క్వార్టర్‌లో 5.7 శాతానికి పడిపోతుందని అంచనా వేయగా, అంచనాలను మించి జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది.
రూటర్స్ పోల్ ప్రకారం జూన్ త్రైమాసికంలో ఇండియన్ ఎకానమీ 5.7 శాతం ఉండనుంది. రాయిటర్స్ పోల్‌లో సర్వే చేసిన మొత్తం 65 మందిలో 40 మంది ఆర్థికవేత్తలు ఈ సంఖ్యను 5.6 శాతంగా లేదంటే అంతకంటే తక్కువగా అంచనా వేశారు. బ్లూమ్‌బర్గ్ కూడా 30 మంది ఆర్థికవేత్తలతో సర్వే నిర్వహించింది. 5.7 శాతంగా ఉంటుందని ఎక్కువమంది అంచనా వేశారు.
ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ Q1 జీడీపీని 5.7 శాతంగా అంచనా వేసింది. వార్షిక వృద్ధి రేటు అంచనాను గతంలోని 7.3 శాతం నుంచి 6.7 శాతానికి సవరించింది.
ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ రూపొందించిన ఆర్థిక సర్వేను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో జీడీపీ వృద్ధిని 7 శాతంగా అంచనా వేశారు. ఆర్బీఐ ఆగస్టులో తన జీడీపీ వృద్ధి రేటును 6.9 శాతానికి తగ్గించింది. జూన్ మానిటరీ పాలసీలో జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతం నుంచి 7 శాతానికి సవరించారు.
ఆయా సంస్థల అంచనా
ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటును రూటర్స్ 5.7 శాతంగా, సీఎల్ఎస్ఏ 5.7 శాతంగా, ఇండియా రేటింగ్స్ 5.7 శాతం, నోమురా 5.7 శాతం అంచనా వేశాయి. ఇయర్లీ జీడీపీ అంచనాల విషయానికి వస్తే... ఎకనామిక్ సర్వే 7 శాతం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.9 శాతం, మూడీస్ 6.2 శాతం, ఏఎన్‌జెడ్ 6.2 శాతం, క్రిసిల్ 6.9 శాతం, యూబీఎస్ 6.7 శాతం అంచనా వేశాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications