న్యూఢిల్లీ: భారత్‌ను డిజిటల్ ఎకానమీగా మార్చేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యవస్థలో నగదు వాడకం తగ్గకపోగా పెరుగుతోందని గురువారం నాటి ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి వ్యవస్థలో కరెన్సీ నోట్ల చలామణి వార్షిక ప్రాతిపదికన 17% పెరిగి రూ.21.10 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. చలామణిలో ఉన్న నోట్లు 6.2 శాతం పెరిగి 10,8759 కోట్లగా ఉన్నాయి.

పెరిగిన నోట్ల సర్క్యులేషన్
ఇప్పుడు చలామణిలో ఉన్న కరెన్సీల్లో అధిక విలువైన రూ.2000, రెండో అధిక విలువ కలిగిన రూ.500 నోట్లకు ఎక్కువ డిమాండ్ ఉందని ఆర్బీఐ తెలిపింది. 2018 మార్చి నాటికి రూ.500, రూ.2,000 నోట్ల కరెన్సీ సర్క్యులేషన్ 80.2 శాతంగా ఉందని తెలిపింది. 2019 మార్చి నాటికి ఇది 82.2 శాతంగా ఉంది. అంటే ఈ నోట్ల సర్క్యులేషన్ గతంలో కంటే పెరిగింది.

పెద్ద నోట్లకు డిమాండ్
రూ.500, రూ.2,000 నోట్లలో ఎక్కువగా వాడకంలో ఉన్న నోట్లలో రూ.500 ఉండటం గమనార్హం. గత ఏడాది సర్క్యులేషన్‌లో రూ.500 నోట్లు 42.9 శాతంగా ఉంటే, ఈ ఏడాది 51 శాతంగా ఉంది.

పెరిగిన నకిలీ నోట్లు..
నోట్ల రద్దు తర్వాత నకిలీ రూ.500 నోట్ల (నోట్ల రద్దు తర్వాత కొత్త డిజైన్ కలిగిన నోట్లు) పెరుగుదల 121 శాతం ఉందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2018-19లో నకిలీ రూ.2,000 నోట్లు 21.9 శాతంగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే రూ.10, రూ.20, రూ.50 విలువ కలిగిన నకిలీ నోట్లు వరుసగా 20.2%, 87.2%, 57.3% గా ఉన్నాయి. రూ.100 నకిలీ నోట్లు మాత్రం 7.5 శాతం తగ్గాయి. రూ.200 నకిలీ నోట్లను కూడా గుర్తించినట్లు తెలిపింది. 2017 ఆగస్ట్‌లో ఈ నోట్లు ప్రవేశపెట్టారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 12728 నకిలీ నోట్లు గుర్తించినట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది 79 నోట్లు గుర్తించింది.

డిజిటల్ పరిస్థితేమిటి?
నోట్ల రద్దు తర్వాత ఓ వైపు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. అదే సమయంలో కరెన్సీ సర్క్యులేషన్ కూడా పెరుగుతుండటం గమనార్హం.
కరెన్సీ వ్యాల్యూ 17 శాతం, కరెన్సీ నోట్ల సంఖ్య 6.2 శాతం (1,08,759) పెరిగిందని ఆర్బీఐ వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరెన్సీలో రూ.500 నోట్ల విలువ 51 శాతమని పేర్కొంది. అంతేగాక రూ.500, 2,000 నోట్లు కలిసి మొత్తం కరెన్సీ విలువలో 82 శాతానికి సమానమని చెప్పింది. త్వరలోనే వార్నిష్ కోటింగ్‌తో కొత్త రకం రూ.100 నోట్లను ప్రవేశపెట్టనుంది. దివ్యాంగులు సులభంగా గుర్తించేలా ఉంటుంది. ఇక రిటైల్ ఎలక్ట్రానిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 59% పెరిగి 23.3 బిలియన్లకు చేరాయని ఆర్బీఐ తాజా నివేదిక తెలిపింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications