సిమెంట్ ధరలు గత కొన్నాళ్లుగా తగ్గుతున్నాయి. నాలుగు నెలల క్రితం రూ.350గా ఉన్న సిమెంట్ ధరలు గురువారం నాటికి రూ.250కి దిగి వచ్చాయి. అంటే కొద్ది నెలల్లోనే సిమెంట్ ధర రూ.100 వరకు తగ్గింది. సాధారణంగా సిమెంట్ ధర ఇంత కిందకు దిగడం వినియోగదారుడికి ఆనందకరమే. గృహయజమానులు, బిల్డర్లు ధర తగ్గింపుపై ఆనందం వ్యక్తం చేస్తారు. కానీ ఇసుక కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఆనందం లేకుండా పోయిందట. ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు ముందుకు కదల్లేదు. దీంతో ధర తగ్గినా సిమెంట్ వినియోగంలో మార్పు లేదు.

తగ్గిన సిమెంట్ ధరలు..
రాష్ట్రంలో రోజుకు లక్షలాది బస్తాల సిమెంట్ వినియోగం ఉంటుంది. వివిధ కంపెనీలు సిమెంట్ మార్కెటింగ్‌లో ఉన్నాయి. అయితే సిమెంట్ ధర తగ్గినప్పటికీ పలు జిల్లాల్లో గతంలో కంటే సగం లేదా అంతకంటే తక్కువ బస్తాలు మాత్రమే సేల్ అవుతున్నాయట. ఇసుక సౌలభ్యం పెరిగితే మళ్లీ సిమెంట్ ధరలు పెరగవచ్చునని చెబుతున్నారు.

పేరుకుపోతున్న నిల్వలు...
ఇసుక కొరత ప్రభావం నిర్మాణాలపై భారీగానే పడింది. సిమెంట్ పైన మాత్రమే కాకుండా ఇటుక పరిశ్రమ కూడా దెబ్బతిన్నది. ఇటుక పరిశ్రమలు కూడా ధరలు తగ్గించాయి. అయినప్పటికీ కొనుగోలు తగ్గిందట. దీంతో స్టాక్స్ పేరుకుపోయాయి. నిల్వ సామర్త్యం లేకపోవడంతో ధరలు తగ్గించి అమ్మినప్పటికీ అంతగా ఆదరణ లేదని తెలుస్తోంది. ఇదివరకు రూ.7గా ఉన్న ఇటుక ధర ఇఫ్పుడు రూ.5కి పడిపోయిందట.

మార్కెట్ ప్రభావమా?
సమీప భవిష్యత్తులో ఇటుక, స్టోర్ చేసుకునేందుకు సౌలభ్యం ఉంటే సిమెంట్‌ను కూడా కొంతమంది బిల్డర్లు కొనుగోలు చేస్తున్నారట. ఏపీలో ఇసుక కొరత కారణంగా ఏపీలో సిమెంట్, ఇటుక ధరలు తగ్గగా, దేశవ్యాప్తంగా కూడా సిమెంట్ ధరలతో పాటు ఇనుము ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఇసుక కారణంగా ధరలు తగ్గలేదని, మార్కెట్ కారణంగా తగ్గిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications