ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన యాన్యువల్ రిపోర్ట్‌ను గురువారం విడుదల చేసింది. ఈ రిపోర్టులో పలు అంశాలను పొందుపరిచారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఫ్రాడ్స్ 74 శాతం పెరిగినట్లుగా ఈ రిపోర్ట్ వెల్లడించింది. 2018-19 ఏడాదిలో కస్టమర్లు రూ.71,543 కోట్ల మేర బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టినట్లు నివేదిక తెలిపింది.
అంతకుముందు ఏడాదిలో రూ.41,167 కోట్ల మేర మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది. కస్టమర్ల మోసాలను బ్యాంకులు గుర్తించగలిగిన సరాసరి సమయం 22 నెలలుగా ఉన్నట్లు తెలిపింది. దేశంలో ఎక్కువ మార్కెట్‌ను ప్రభుత్వరంగ బ్యాంకులే కలిగి ఉన్నాయని, అలాగే, మోసాలు కూడా ఈ బ్యాంకుల్లోనే అధికమని వెల్లడించింది. ఆ తర్వాత ప్రైవేటు, ఫారన్ బ్యాంకులు ఉన్నట్లు తెలిపింది.

ప్రభుత్వ, ప్రైవేటు, పారన్ బ్యాంకులు.. ఇలా అన్ని బ్యాంకుల మోసాల్లోను రుణాలకు సంబంధించిన ఎగవేతలే ఎక్కువగా ఉన్నాయి. కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ జమ మోసాలు 2018-19లో 0.3 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపింది. ఆ ఏడాదిలో పోర్జరీ, మోసం కేసులు 72 నమోదైనట్లు తెలిపింది. రూ.లక్ష కన్నా తక్కువ విలువైన బ్యాంకు మోసాలు 0.1 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications