నష్టాల్లో మర్కెట్లు, 300 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9:21 నిమిషాలకు సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి 37,299 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు కోల్పోయి 10,998 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. 286 కంపెనీలకు చెందిన షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 489 కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 28 కంపెనీల షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.90 వద్ద ఉంది.
మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 334.11 (0.89%) పాయింట్లు కోల్పోయి 37,117.73 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 95.75 (0.87%) పాయింట్లు కోల్పోయి 10,950.35 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.00 వద్ద ఉంది. బంగారం ధర దాదాపు రూ.40,000 సమీపంలో ఉంది. బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ONGC, హిందూస్తాన్ యూనీలీవర్, మారుతీ, VEDL, సన్ ఫార్మా,
ఇండియా బుల్స్ హౌసింగ్, ద్వారికేష్ షుగర్, ధాంపూర్ షుగర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, కోల్ ఇండియా, సిప్లా, పవర్ గ్రిడ్, డీఆర్‌ఎల్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, రిలయన్స్, కొటక్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐఎన్, కాఫీ డే, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, యస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications