రికార్డ్‌కు చేరువలో.. పెరిగిన బంగారం ధర, కోలుకున్న రూపాయి
బంగారం ధరలు గురువారం నాడు కూడా పెరిగాయి. అదే సమయంలో రూపాయి మరింత బలహీనపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 0.2 శాతం పెరిగి 1,542.06 డాలర్లుగా ఉంది. బుధవారం నాడు బంగారం ధరలు ఔన్సుకు 1,554.56 డాలర్ల హైకి చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత కాస్త తగ్గాయి. నిన్నటి ముగింపుతో పోలిస్తే బంగారం ధరలు 0.2 శాతం మాత్రమే పెరిగాయి.
ఆగస్ట్ నెలలో ఇప్పటి వరకు బంగారం ధర 6.6 శాతం పెరిగిందని SPDR గోల్డ్ హోల్డింగ్స్ వెల్లడించింది. ఇక, దేశీయ మార్కెట్లో బంగారం ధర.. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర మధ్యాహ్నం 12 గంటల సమయంలో రూ.39,355గా ఉంది. వెండి ధర కిలో రూ.47,222గా ఉంది. మరోవైపు మధ్యాహ్నం సమయానికి రూపాయి కాస్త కోలుకొని డాలర్ మారకంతో 71.76 వద్ద ఉంది.

స్థానిక వర్తకుల నుంచి కొనుగోళ్ల డిమాండ్, మరోవైపు అంతర్జాతీయ దేశాల ఆర్థిక మందగమనం కారణంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షిత పసిడివైపు మళ్లిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధర రూ.40వేలకు చేరువైంది. బుధవారం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.39,970కి చేరుకుంది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. ఆభరణాల వర్తకులు, నాణేల తయారీదారుల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ఏకంగా రూ.2,110 ఎగబాకి రూ.48,850కి చేరుకుంది. బుధవారం అమెరికా మార్కె ట్లో అతి విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా ఎగిశాయి.


Click it and Unblock the Notifications