అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయం పడిపోయిందా? వృద్ధి రేటు అంచనా కంటే ఎక్కువగా పడిపోయిందా? అంటే అవుననే అంటున్నారు. వాణిజ్య పన్ను వృద్ధి రేటు అంచనా 14 శాతం ఉండగా, 5.3 శాతానికే పరిమితమైందని, ఇందుకు ఐరన్, స్టీల్ ధరలు తగ్గడమే కారణమని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సిమెంట్ ధరలు కూడా తగ్గాయని, ఈ ప్రభావం ఏపీ ఆదాయం పైన పడిందని చెబుతున్నారు. గత నాలుగు నెలల్లో కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ భారీగా పడిపోయిందట.

భారీగా తగ్గిన వాణిజ్య పన్ను వృద్ధి రేటు
వాణిజ్య పన్ను వృద్ధి రేటును 14 శాతంగా అంచనా వేయగా నాలుగు నెలల్లో భారీగా తగ్గి 5.3 శాతానికే పరిమితమైందని ఆర్థిక సంవత్సరం ముగేసి నాటికి ఈ ఆదాయం మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా పైన సమీక్ష నిర్వహించారు. నాలుగు నెలల్లో అనుకున్న మేర వృద్ధి లేదని, ఉక్కు, ఇనుము, సిమెంట్ ధరలు తగ్గాయని, ఈ ప్రభావం కనిపించిందని, పన్ను రాబడి పడిపోయిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆటో సెక్టార్‌లో మందగమనం కారణంగా జీఎస్టీ తగ్గిందన్నారు.

మెరుగుపడతాయని ఆశలు...
ఇలా పలు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఏపీ ఆదాయం తగ్గింది. 'ఇనుము, ఉక్కు, సిమెంట్ ధరల తగ్గుదల మొత్తం ఆదాయ సేకరణపై ప్రభావం పడింది. దీనికి తోడు ఆటో మొబైల్ రంగంలో మందగమనం జీఎస్టీ వసూళ్లను తగ్గించింది' అని అధికారులు తెలిపారు. అయితే ఈ నాలుగు నెలల్లో తగ్గినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆదాయాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. జీఎస్టీ పరిహారం కింద సెప్టెంబర్ మొదటి వారంలో రూ.597 కోట్లు ఏపీకి రానుంది. ముందు ముందు వాణిజ్య పన్నుల ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 14 శాతం సాధిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

12 లక్షల కేసుల మద్యం వినియోగం తగ్గుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశలవారీగా మద్య నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మద్యం వినియోగం గణనీయగా తగ్గిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మద్యం వినియోగం పడటంతో రాబడి కూడా తగ్గిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు గత ఏడాదితో పోలిస్తే 12 లక్షల కేసుల వినియోగం తగ్గినట్లు చెప్పారు.

బెల్ట్ షాప్స్ తొలగింపు వల్ల తగ్గిన విక్రయాలు...
2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 125 లక్షల కేసుల మద్యాన్ని విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బెల్ట్ షాప్స్ తొలగింపు వల్ల ఇప్పటికే భారీగా విక్రయాలు తగ్గాయి. ముందుముందు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న షాపుల సంఖ్యను 4,380 నుంచి 3,500కు తగ్గించి, ఆ తర్వాత APSBCL ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

రూ.500 కోట్లు కేటాయింపు...
లిక్కర్ డీ-అడిక్షన్ సెంటర్లు, మద్య నియంత్రణ, నిషేధానికి రూ.500 కేటాయిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 503 మద్యం దుకాణాల్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహించటం వల్ల 16 వేల ఉద్యోగాలు రానున్నాయి.

వాణిజ్య పన్నుల తగ్గుదలకు కారణాలు...
- మద్యపానం విక్రయించే బెల్ట్ షాప్స్ తగ్గడంతో పాటు సేల్స్ భారీగా తగ్గిపోవడం
- ప్రధానంగా బెల్ట్ షాప్స్ మూసివేత మద్యం వినియోగం తగ్గించడానికి ఉపయోగపడింది.
- 2018-19 ఆర్థిక సంవత్సరంలో జూలై నెల వరకు అమ్మిన సేల్స్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా 12 లక్షల కేసుల సేల్స్ తగ్గాయి.
- అక్టోబర్ నాటికి మద్యం దుకాణాలను 4,380 నుంచి 3,500కు తగ్గిస్తారు. మొత్తం నిషేధం వచ్చే వరకు ప్రతి సంవత్సరం 20 శాతం చొప్పున దుకాణాలు మూసివేస్తారు.
- సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం 503 మద్యం దుకాణాలను ప్రారంభిస్తుంది.
- డీ-అడిక్షన్ సెంటర్ల వంటి వాటి కోసం రూ.500 కోట్లు కేటాయింపు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications