కరాచీ: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీని బడ్జెట్ లోటు దాదాపు మూడు దశాబ్దాల గరిష్టానికి చేరుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన దాని ప్రకారం జూన్‌తోముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆ దేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (జీడీపీ)లో ద్రవ్యలోటు 8.9 శాతానికి చేరింది. గత ముప్పై ఏళ్లలో ఇదే అత్యధికం.
ప్రభుత్వం ద్రవ్యలోటును 4.9 శాతాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఫలితం లేదు. ఆ తర్వాత దీనిని 7.1 శాతానికి నియంత్రించాలని భావించింది. అదీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు 8.9 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఏడాది (6.6 శాతం)తో పోలిస్తే చాలా ఎక్కువ. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి చాలా ఎక్కువగా ఉండటం పాక్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్.

దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ
గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. గత ఏడాదికి ద్రవ్యలోటు 8.9 శాతం నమోదు కాగా, దీని విలువ రూ.3.4 లక్షల కోట్లు. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటు అంటాం.
పాకిస్తాన్‌కు చైనా, ఖతార్ వంటి దేశాలు బెయిలవుట్ ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మానటరీ ఫండ్ (IMF) పాకిస్తాన్‌కు 6 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.

IMF బెయిలవుట్ నిబంధన
IMF బెయిలవుట్ నిబంధన ప్రకారం ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే జూలై నాటికి ప్రభుత్వం రెవెన్యూ 40 శాతం పెరగాలి. 6 బిలియన్ డాలర్ల లోన్‌కు షరతులు విధించింది. IMF విధించిన ఆదాయ లక్ష్యానికి పాకిస్తాన్ చేరుకోకుంటే రుణ ప్రమాదంలో పడే అవకాశముంది.

నిర్దేశించిన లక్ష్యం కష్టమే
IMP నిర్దేశించిన లక్ష్యం కష్టంగా ఉందని కరాచీలోని అరీఫ్ హబీబ్ లిమిటెడ్ రీసెర్చ్ డైరెక్టర్ సమీయుల్లా తారిఖ్ అన్నారు. తాజా క్వార్టర్‌లో రెవెన్యూ క్షీణత 20 శాతంగా ఉందని, నాన్-ట్యాక్స్ రెవెన్యూలో 98 శాతం క్షీణత కారణంగా ఇరవై శాతం తగ్గింది.
ఈ క్వార్టర్‌లో కనుక లక్ష్యాన్ని చేరుకోని పక్షంలో ట్యాక్సెస్ పెంపుకు మినీ బడ్జెట్ ఉండవచ్చునని చెబుతున్నారు. నా జీవితంలో ఇలాంటి గణాంకాలు చూడలేదని మాజీ ఆర్థిక సలహాదారు అష్ఫాక్ హసన్ అన్నారు.

పాక్‌లో దారుణ పరిస్థితి...
తాజా ద్ర్యలోటు గమణిస్తే పాకిస్తాన్‌లో ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పాక్ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతానని హామీ ఇచ్చి ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాడు. కానీ పరిస్థితులు మరింతగా దిగజారాయి. గత నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 నుంచి రూ.6 మధ్య పెంచారు. పెట్రోల్ రూ.117, డీజీల్ రూ.132 వరకు ఉంది. కిరోసిన్ ధర కూడా పెరిగింది. కొత్త ఉద్యోగ నియామకాలు కూడా నిలిపేశారు. కార్ల కొనుగోలుపై నియంత్రణలు విధించారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications