మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) లో పెట్టుబడి దారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా అనేక మంది ఇన్వెస్టర్లు వీటిపై ద్రుష్టి సారిస్తున్నారు. నేరుగా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టలేని వారు వీటిని ఎంచుకుంటున్నారు. విభిన్న రకాల ఇన్వెస్టర్ల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉత్పత్తులను అందిస్తుండటం వల్ల తమ రాబడులను పెంచుకోవడానికి కొత్త ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే దశాబ్ద కాలంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లకు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఎంఎఫ్ ఇన్వెస్టర్ల సంఖ్య 2 కోట్లకు పైగా ఉంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఆస్తుల (ఏయూఎం) విలువ ఇప్పుడు రూ. 25 లక్షల కోట్లుగా ఉంది. దీన్ని నాలుగురెట్లు పెంచుకొని రూ. 100 లక్షల కోట్లకు చేర్చుకోవాలన్నది పరిశ్రమ లక్ష్య మని యాంఫి-బీసీజీ విజన్ డాక్యుమెంట్ పేర్కొంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకోవడంపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
ఇదీ వ్యూహం
* ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగస్తులు ఇతర వర్గాలకు మ్యూచువల్ ఫండ్స్ పై అవగాహనా బాగానే ఉంది. అయితే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికీ మాత్రం మ్యూచువల్ ఫండ్స్ పై ఇంకా అవగాహనా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలపై కంపెనీలు దృష్టిపెడుతున్నాయి.
* మ్యూచువల్ ఫండ్స్ పంపిణీని పెంచుకోవడానికి గాను బ్యాంకులు, పోస్టాఫీసులకున్న భారీ నెట్ వర్క్ ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అంతేకాకుండా నేరుగా, డిజిటల్ ఛానళ్ల ద్వారా ఎక్కువ మంది ఇన్వెస్టర్లను చేరుకోవాలనుకుంటున్నారు.

* మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన లేని వారు తమ పెట్టుబడులను బ్యాంక్ డిపాజిట్లలోకి, బంగారంలోకి మళ్లిస్తున్నారు. వెట్టి వల్ల వారికి స్థిరమైన రాబడి రిస్క్ లేకుండా వస్తోంది. అయితే కాస్త రిస్క్ ఉన్నా కొంత కాలం వేచిచూస్తే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
సిప్ ల హవా
* మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు క్రమానుగత పెట్టుబడి ప్లాన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
* 2016 ఏప్రిల్ నుంచి 2019 జులై వరకు సిప్ పెట్టుబడులు రూ. 2.30 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదేకాలంలో సిప్ ఖాతాల సంఖ్య కోటి నుంచి 2.73 కోట్లకు పెరిగాయి.
* సిప్ ల ద్వారా ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2016-17 సంవత్సరంలో రూ.44,000 కోట్లు ఉండగా 2018-19 సంవత్సరంలో రూ.93,000 కోట్లకు పెరిగాయి.
* 2014 మార్చి నుంచి 2019 జూన్ వరకు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 4.42 కోట్ల ఫోలియో లను జత చేసుకుంది.
* వ్యక్తిగత ఇన్వెస్టర్స్ ( రిటైల్, హెచ్ ఎన్ ఐ) విభాగంలో ఫోలియో ల సగటు వృద్ధి ఇదే కాలంలో 15.5 శాతంగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications