నష్టాల్లో మార్కెట్లు, బలహీనంగానే రూపాయి
ముంబై: షేర్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం గం.9.51 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 74 పాయింట్లు నష్టపోయి 37,566 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 11,085 వద్ద ట్రేడ్ అయింది. డాలర్ మారకంతో రూపాయి విలువ విలువ 71.57 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సెన్సెక్స్ 180.75 (0.48%) పాయింట్లు నష్టపోయి 37,460.95 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 49.25 (0.44%) పాయింట్లు కోల్పోయి 11,056.25 వద్ద ట్రేడ్ అయింది.
యస్ బ్యాంకు, అశోక్ లేలాండ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పీసీ జ్యువెల్లర్స్, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, జీ ఎంటర్టైన్మెంట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. వొడాఫోన్ ఐడియా, ఐడీబీఐ బ్యాంకు, ఎన్బీసీసీ, ఇండియా బుల్స్ హౌసింగ్, టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

వొడాఫోన్ - ఐడియా షేర్లు దాదాపు 6 శాతం కోల్పోయాయి. గత రెండు మూడు సెషన్లుగా ఇది నష్టపోతోంది. బీఎస్ఈలోని మార్కెట్ వ్యాల్యూ ప్రకారం స్టాక్స్ 77 శాతం కోల్పోయాయి.
అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, తాజాగా చర్చల ఆశల నేపథ్యంలో రెండు రోజుల పాటు మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. కానీ బుధవారం మళ్లీ ప్రారంభ నష్టాలు మూటగట్టుకున్నాయి. రూపాయి ఈ రోజు కూడా బలహీనపడింది. మధ్యాహ్నం 11.37 నిమిషాలకు రూపాయి 23 పైసలు బలహీనపడి 71.71 వద్ద ఉంది. సౌత్ కొరియా వోన్, థాయ్ భాహ్త్, మలేషియా రింగిట్, జపాన్ యెన్, ఇండోనేషియా రుపాయా కూడా బలహీనపడ్డాయి.


Click it and Unblock the Notifications