దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నాడు 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ హై రూ.39,970కి చేరుకుంది. స్థానిక జ్యువెల్లర్ వ్యాపారుల నుంచి డిమాండ్ ఉండటంతో రూ.300 పెరిగింది. అలాగే, బంగారంపై పెట్టుబడి కూడా సురక్షితమైనదిగా చాలామంది భావిస్తున్నారు. అంతకుముందు వరుసగా ఐదు సెషన్‌లలో బంగారం ధర పెరిగింది. మంగళవారం నిలకడగా ఉంది. ఈ రోజు మళ్లీ పెరిగింది. వెండి ధర కిలో రూ.2,110 పెరిగి రూ.48,850గా ఉంది. కాయిన్ మెకర్స్, ఇండస్ట్రియల్ యూనిట్స్ నుంచి డిమాండ్ ఉండటంతో పెరిగింది.

ఢిల్లీలో ధరలు...
ఫెస్టివెల్ సీజన్ ప్రారంభమైంది. దీంతో జ్యువెల్లర్స్ నుంచి డిమాండ్ పెరిగింది. అలాగే ఇన్వెస్టర్లు కూడా పసిడి సురక్షితమైనదిగా భావిస్తున్నారు. ఢిల్లీలో99.9 ప్యూరిటీ కలిగిన బంగారం రూ.300 పెరిగి రూ.39,970గా, 99.5 ప్యూరిటీ కలిగిన బంగారం రూ.300 పెరిగి రూ.39,800గా ఉంది. సావరీన్ గోల్డ్ ధర కూడా రూ.300 పెరిగి రూ.29,800గా (8 గ్రాములు) ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఆరేళ్ల గరిష్టానికి చేరుకొని స్థిరంగా ఉంది. ఇంట్రాడేలో స్పాడ్ గోల్డ్ 0.3 శాతం పెరిగి ఔన్స్ $1,537.21గా ఉంది. రెండు రోజుల క్రితం సోమవారం ఇది $1554.56గా ఉంది.

బంగారానికి రెక్కలు...
కాగా, గత కొంతకాలంగా బంగారానికి రెక్కలు వచ్చాయి. ఆరేళ్లలో ఎప్పుడూ ఇంత స్థాయిలో బంగారం పెరగలేదు. భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మంగళవారం రోజున పుత్తడి ధరలు అమాంతంగా పెరిగిపోయాకా... ఆ తర్వాత స్థిరంగానే ఉన్నాయి. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగిపోవడానికి కారణం ఏమిటి..? అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ మార్కెట్లలో నెగిటివ్ టాక్ రావడం, మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ కాకపోవడం వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 2007 తర్వాత అమెరికా మార్కెట్లలో ఈ స్థాయిలో బంగారం ధరలు పెరగడం ఇదే తొలిసారి. బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, రియల్ ఎస్టేట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసేదానికంటే బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారట.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..



Click it and Unblock the Notifications