న్యూఢిల్లీ:ఎఫ్‌డీఐలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. వివిధ రంగాల్లో విదేశీ బెట్టుబడులకు డోర్లు తెరిచింది. బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో ఎఫ్‌డీఐ సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్ల నిబంధనలను సరళతరం చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలపై కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని పట్టాలెక్కించేందుకు నాలుగు రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల్ని సరళీకృతం చేసింది.
బొగ్గు తవ్వకాలు, సంబంధిత ప్రాసెసింగ్ కార్యకలాపాలు ఆటోమేటిక్ మార్గంలో వంద శాతం ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు. కాంట్రాక్ట్-మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వంద శాతం, బ్రాడ్ కాస్టింగ్‌లో 49 శాతం, డిజిటల్ మీడియాలో 26 శాతం పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
సింగిల్ బ్రాండ్ రిటైల్లో ఎఫ్‌డీఐల కోసం స్థానిక సోర్సింగ్ నిబంధనలు సడలించినట్లు తెలిపారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ నిర్వచనాన్ని కేబినెట్ విస్తరించిందన్నారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ ఔట్‌లెట్స్ ఆన్ లైన్ సేల్స్‌కు ఆమోదం తెలిపింది. స్థానిక సోర్సింగ్ నిబంధనలు సడలించామన్నారు. సడలించిన ఈ నిబంధనలతో ఆయా కంపెనీలు తమ షాప్స్ ఏర్పాటు చేయకముందే ఆన్ లైన్ రిటైలింగ్ సేల్స్ కొనసాగించవచ్చునని చెప్పారు.

సింగిల్ బ్రాండ్ రీటెయిల్‌లకు ఇప్పటి వరకు ముప్పై శాతం స్థానిక సోర్సింగ్ నిబంధనలు ఉండేవి. వాటిని ఇప్పుడు సడలించారు. దీని వల్ల సంస్థలకు ఎక్కువ సౌలభ్యం కల్పించినట్లు అవుతుందన్నారు. అయితే మల్టీ బ్రాండ్ రిటైల్లో పెట్టుబడుుల గురించి కేబినెట్ చర్చించలేదన్నారు.
మొత్తంగా సింగిల్ బ్రాండ్ రిటైల్, డిజిటల్ మీడియా, మానుఫాక్చరింగ్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలిస్తున్నట్లు తెలిపింది. ఇలా చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని కేంద్రమంత్రులు చెప్పారు. FDI రెగ్యులేషన్స్‌ను సడలించడం ద్వారా ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుందన్నారు. ఇండియాను తయారీ రంగంలో వరల్డ్ హబ్‌గా మారుస్తామన్నారు.
గతంలో ఫారెక్స్ నిల్వలు సున్నా స్థాయికి చేరుకున్నాయని, మోడీ హయాంలో అవి 280 మిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్రమంత్రులు తెలిపారు. ఫారన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆకర్షణలో భారత్ ముందుందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఎక్స్‌పోర్ట్స్‌ను ప్రోత్సహిస్తామన్నారు. అలాగే, ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
75 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 24,734 కోట్లను కేటాయించనుంది. కొత్తగా 45వేల ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు పెంచనున్నారు. చెరకు రైతులకు సబ్సిడీ పెంచాలని నిర్ణయించారు. అరవై వేల టన్నుల చక్కెర ఎగుమతికి సబ్సిడీ ఇస్తారు. రైతులకు నగదును బదలాయించాలని నిర్ణయించారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications