నిన్నటి భారీ లాభాలను నిలబెట్టుకుంటూ వరుసగా రెండో రోజు కూడా మెరుగైన పనితీరును కనబర్చి ఇన్వెస్టర్లలో కొద్దిగా ధైర్యాన్ని నింపింది స్టాక్ మార్కెట్. ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్ల రిజర్వ్ నిధులను మళ్లించడం కూడా పాజిటివ్ పాయింట్‌గా కలిసొచ్చింది. తొమ్మిది సెషన్స్ తర్వాత మళ్లీ 11 వేల పాయింట్ల ఎగువన నిఫ్టీ క్లోజవడం బుల్స్‌ను రేస్‌లో నిలబెట్టింది. అయితే ఈ రోజు కూడా మిడ్ సెషన్ తర్వాత ఒడిదుడుకులు కొద్దిగా టెన్షన్ పెట్టించాయి. 11,140 పాయింట్ల నుంచి నిమిషాల్లోనే 11,080 పాయింట్లకు దిగొచ్చింది నిఫ్టీ.
అయితే మరింతగా పడిపోవచ్చని భావించిన తరుణంలో నిఫ్టీ మళ్లీ అనూహ్యంగా పుంజుకుంది. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లకు బూస్టింగ్‌నిచ్చాయి. ప్రభుత్వం ఆటో రంగానికి ఊతమిచ్చే దిశగా అడుగులు వేయడం ఆటో స్టాక్స్‌లో ఆశలు నింపింది. చివరకు సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 37641 దగ్గర ముగిసింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,105 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్లు పెరిగి 28126 దగ్గర క్లోజైంది.

టాటా మోటార్స్, బ్రిటానియా, టాటా స్టీల్, యెస్ బ్యాంక్, ఎన్టీపీసీ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, గ్రాసిం స్టాక్స్ టాప్ ఫైవ్ లూజర్స్ జాబితాలో చేరాయి.
ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ సూచీల్లో.. స్మాల్, మైక్రో క్యాప్ స్టాక్స్ ఈ రోజు మార్కెట్లో మంచి ఉత్సాహాన్ని కనబర్చాయి. చాలా కాలం తర్వాత ఈ స్టాక్స్‌లో ఒక స్థిరమైన పాజిటివ్ యాక్టివిటీ కనిపించింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 2 శాతం వరకూ లాభపడింది. ఇక సెక్టోరల్ ఇండిసిస్‌లో ఐటీ, మీడియా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలూ లాభపడ్డాయి. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ ఇండెక్స్‌లు మెరుగైన పనితీరు కనబర్చాయి.
బ్యాంక్ నిఫ్టీ రన్
బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు కూడా జోరుమీదుంది. ఆర్బీఎల్ మినహా దాదాపు ఈ ఇండెక్స్‌లో ఉన్న అన్ని షేర్లూ లాభపడ్డాయి. ముఖ్యంగా యెస్ బ్యాంక్ 3.5 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3 శాతం లాభపడ్డాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్పీఐ కూడా రెండు శాతం వరకూ పెరగడం బ్యాంక్ నిఫ్టీకి కలిసొచ్చింది.
మూడు నెలల తర్వాత
వరుస పతనాలతో కుప్పకూలిపోతూ.. నిత్యం 52 వారాల కనిష్టానికి పడిపోతున్న ఆటోమొబైల్ స్టాక్స్ ఈ రోజూ కాస్త తేరుకున్నాయి. ఆటో రంగానికి ఊతమిచ్చేందుకు బీఎస్6ను కాస్త ఆలస్యం చేయడం, వాళ్ల అప్పులను ఎన్పీఏలుగా తక్షణం పరిగణించకుండా కొన్ని మార్పులు చేయడం వంటివి కలిసొచ్చే అంశాలుగా చూస్తోంది మార్కెట్. దీంతో ఈ రోజు టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ స్టాక్స్ లాభాల స్పీడ్‌లో పరిగెట్టాయి. టాటా మోటార్స్ 9 శాతం, అశోక్ లేల్యాండ్ 6.2శాతం పెరిగాయి. మిగిలిన వాటిల్లో మదర్సన్ సుమీ, అపోలో టైర్స్, ఐషర్ స్టాక్స్ 3 శాతం వరకూ లాభపడ్డాయి. మూడు నెలల తర్వాత మళ్లీ ఈ స్టాక్స్ ఈ స్థాయిలో పెరుగుతుండడం ప్రధానంగా గమనించాల్సిన అంశం.
వాడియా స్టాక్స్.. వారెవ్వా..
దేశానికి చెందిన పూర్వపు సంస్థల్లో ఒకటైన వాడియా గ్రూప్ స్టాక్స్ ఈ రోజు భారీగా లాభపడ్డాయి. ప్రధాన కారణమేదీ స్పష్టంగా తెలియనప్పటికీ ఈ స్టాక్స్ హై జంప్ చేశాయి. 1736 నుంచి ఇండియాలో వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న వాడియా గ్రూపునకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు నాలుగు ఉన్నాయి. వాటిల్లో బాంబే డైయింగ్, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్, బ్రిటానియా ఇండస్ట్రీస్, నేషనల్ పెరాక్సైడ్ ఉన్నాయి. ఈ రోజు ట్రేడ్‌లో బాంబే డైయింగ్ 20 శాతం, బాంబే బర్మా 18 శాతం, నేషనల్ పెరాక్సైడ్ 7 శాతం, బ్రిటానియా 6.4 శాతం పెరిగాయి.
రూపాయి పెరుగుతున్నా.. ఐటీ నీరసం
కరెన్సీ మార్కెట్లో రూపాయి కాస్త స్థిరంగానే ఉన్నా.. ఐటీ స్టాక్స్ మాత్రం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఈ రోజు డాలర్‌తో పోలిస్తే మన రూపాయి అర శాతం వరకూ తగ్గింది. అయితే ఈ మధ్యకాలంలో కొద్దో గొప్పో పెరిగిన నేపధ్యంలో ఈ స్టాక్స్‌లో సెల్లింగ్ ప్రెషర్ పెరిగింది. ఇన్ఫోసిస్ 2.3 శాతం, మైండ్ ట్రీ 3.6 శాతం, టీసీఎస్, టెక్ మహ 2 శాతం వరకూ దిగొచ్చాయి.
మూడో రోజూ లాభాలు
యెస్ బ్యాంక్ స్టాక్ మూడో రోజు కూడా లాభాల్లో ముగిసింది. ఈ రోజు స్టాక్ 2.06 శాతం లాభాలతో రూ.64.30 దగ్గర స్థిరపడింది. ఇదే బాటలో వరుసగా ఏడో రోజు కూడా లాభపడింది కాఫీ డే స్టాక్. ఈ రోజు కూడా 3.5 శాతం పెరిగి రూ.87.10 దగ్గర క్లోజైంది స్టాక్. ఈ మధ్య రూ.63 వరకూ పడిపోయిన స్టాక్ ఇప్పుడు కాస్త నిలదొక్కుకుంది.
More From GoodReturns

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications