రిటైల్ ఇన్వెస్టర్లు రిస్క్ తక్కువగా ఉండి ఎక్కువ రిటర్న్ వచ్చే మార్గాలను అన్వేషిస్తుంటారు. అందుకే వీరు ఎక్కువగా బ్యాంకు డిపాజిట్లను ఎంచుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీరేట్లను బాగా తగ్గించి వేస్తున్నాయి. ఏ బ్యాంకులో చూసినా వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. అలాగని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే సాహసం చేయలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వారు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలు (ఎన్ బీ ఎఫ్ సీ) జారీ చేస్తున్న నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్ సిడీ)ను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

పెరుగుతున్న విశ్వాసం
వాస్తవానికి ఎన్ బీ ఎఫ్ సీలు తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వీటికి నిధులు లభించడం చాలా కష్టంగా మారుతోంది. అయితే ఈ పరిస్థితి అన్ని కంపెనీల్లో లేదని ఇన్వెస్టర్లు గుర్తిస్తున్నారు. అందుకే పెట్టుబడులకు ముందుకువస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

జోరుగా ఆదరణ
* ఇటీవల కొన్ని కంపెనీలు తమ ఎన్సీడీ లను జారీ చేశాయి. వీటికి ఇన్వెస్టర్ల నుంచి ఉహించనివిధంగా స్పందన వచ్చింది.
* టాటా క్యాపిటల్ ఇటీవల రూ.500 కోట్ల ఎన్సీడీ ఇష్యూను విడుదల చేసింది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.175 కోట్ల మేరకు ఇష్యూ ను కేటాయించింది. ఉనికి 450 రేట్ల అధిక స్పందన లభించింది. అంటే రూ.787 కోట్ల మేరకు స్పందన వచ్చిందన్న మాట.
* ఐఐఎఫ్ఎల్ రూ.100 కోట్ల ఇష్యూ ను విడుదల చేసి రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 40 కోట్ల ఇష్యును కేటాయించింది. ఇది 408 రేట్లు (రూ. 163 కోట్లు) ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది.
* జేఎం ఫైనాన్షియల్ రూ. 100 కోట్ల ఇష్యూను తెచ్చి రూ. 40 కోట్ల ఇష్యూ ను రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసింది. దీనికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 185 శాతం ఓవర్ సబ్ స్క్రిప్షన్ లభించింది.
* శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ తెచ్చిన ఇష్యూ 278 శాతం ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది.

ఇండియా బుల్స్
* ఇండియా బుల్స్ రూ. 333 కోట్ల ఇష్యూ ను తీసుకువచ్చి రూ. 133 కోట్ల ఇష్యూ ను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. ముత్తూట్ ఫైనాన్స్ రూ. 100 కోట్లలో సగం రిటైల్ కోసం కేటాయించింది. దీనికి 1077 రెట్ల స్పందన లభించింది.
* గత ఏప్రిల్ నుంచి జులై వరకు శ్రేయి ఇన్ఫ్రా, ఈసీఎల్ ఫైనాన్స్, ముత్తూట్ హోమ్ ఫిన్, మాగ్మా ఫిన్ కార్ప్ ఇష్యూ లు వచ్చాయి. ఇవి 160 శాతం నుంచి 322 శాతం వరకు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యాయి.

17 ఇష్యూలు
* ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 17 ఇష్యూ లు మార్కెట్లోకి వచ్చాయి. వీటి పరిమాణం రూ.19,000 కోట్లు. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 8 ఇష్యూ లు రాగా వీటి పరిమాణం రూ. 21, 200 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications