న్యూఢిల్లీ: రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా ఇండియన్ రైల్వే హిస్టరీలో తొలిసారి ప్రైవేటు పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. రైల్వేలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు తేజాస్ రైళ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపేందుకు సిద్ధమైంది. త్వరలో ఈ ప్రైవేటు రైలు పట్టాలు ఎక్కనుంది. తొలి రైలును ఢిల్లీ - లక్నో మధ్య వచ్చే నెల చివరలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు రైలు ప్రయాణీకులను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు ప్రకటించనుందని తెలుస్తోంది.

వరల్డ్ క్లాస్ అనుభూతి
ఢిల్లీ - లక్నో మార్గంలో శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. దీని ధరకు కాస్త అటు ఇటుగా ఈ ప్రైవేటు రైలు టిక్కెట్ ధర ఉండనుందని సమాచారం. ప్రయాణీకులకు వరల్డ్ కాల్స్ అనుభూతిని ఈ ప్రైవేటు రైలు కల్పించనుంది. సాధారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తాయనే అపవాదు ఉంది. దీనిపై కూడా ఈ ప్రైవేటు రైలు ఓ కొత్త ఆలోచన చేసింది. రైలు గంటసేపు ఆలస్యంగా నడిస్తే పరిహారం చెల్లించే మార్గాల్ని పరిశీలిస్తోంది.

టీ, భోజన, అల్పాహార ఏర్పాట్లు
ఈ రైల్లో రెండుసార్లు భోజనం, ఉచితంగా టీ, కాఫీలు ఇవ్వనున్నారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం సమయంలో కొన్ని స్నాక్స్ ఇవ్వనున్నారట. రైలు బోగీల్లో పాంట్రీ కార్లు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు ఉచితంగా కాఫీ, టీ తాగేలా వెండింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నారట. ఉచితంగా మీకు నచ్చినది తీసుకోవచ్చు.

విమానం కంటే మిన్న... 72 మందికి ఓ టాయిలెట్...
విమానంలో కూడా 150 మంది ప్రయాణీకులకు కేవలం మూడు టాయిలెట్స్ మాత్రమే ఉంటాయని, కానీ ఈ తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో (ప్రైవేటు రైలు) మాత్రం ప్రతి 72 మంది ప్రయాణీకులకు రెండు టాయిలెట్స్ ఉంటాయని ఓ అధికారి వెల్లడించారు. ఈ రైలులో ఎయిర్ క్రాఫ్ట్ మిర్రర్ టాయిలెట్ ఫెసిలిటీ ఉండనుంది.

సీనియర్ సిటిజన్లకు 40 శాతం డిస్కౌంట్
శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు దగ్గరగా ఈ ఛార్జీలు ఉంటాయి. సీనియర్ సిటిజెన్లకు టికెట్లపై 40 శాతం డిస్కౌంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. టిక్కెట్ ధర ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు సీజన్‌ను బట్టి ఉండనుందట.

పండుగ సమయంలో భారం, డిమాండ్ లేకుంటే ఆఫర్
పండుగల సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో టిక్కెట్ ధర పెంచడం, డిమాండ్ తక్కువగా ఉన్న సమయాల్లో ఆఫర్లు ఇస్తారట. డిమాండ్ సమయంలో రష్ నుండి డబ్బు సంపాదించడానికి డైనమిక్ ధర నమూనాను ఉపయోగిస్తుందట. లీన్ సీజన్లో, టిక్కెట్లను తగ్గింపు ధరతో అందించనుందట.

గంటసేపు ఆలస్యమైతే పరిహారం
రైలు గంటసేపు ఆలస్యమైతే అందుకు తగిన పరిహారం కూడా చెల్లించనుందని సమాచారం. ఢిల్లీ - లక్నో అనంతరం ముంబై - అహ్మదాబాద్ మార్గంలోని ఈ తరహా రైలును నవంబర్ నెల మధ్యలో ప్రారంభించనున్నారు. ఈ రైళ్లోను ఇవే ఆఫర్లు వర్తించనున్నాయట.

ఇన్సురెన్స్ సహా ఇంట్లో దొంగలు పడితే... బంపరాఫర్
తైజాస్ రైలు టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.50 లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమా ఉంటుందట. మరో విషయం ఏమంటే మీరు రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో మీ ఇంట్లో దొంగలు పడితే ఆ నష్టపరిహారం కూడా వస్తుంది. ఇన్సురెన్స్ కంపెనీల నుంచి మల్టిపుల్ ఆఫర్స్ ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారట.

78 శాతం ఆఖ్యుపెన్సీతో నడుస్తుందని..
రైల్వేలు ఉచిత ధరలను అనుమతించినప్పటికీ, ప్రభుత్వ రైల్వే టికెటింగ్ దుస్తుల్ని శాతాబ్దిలో అందించే వాటికి అనుగుణంగా ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నారట. 12 కోచ్‌లు కలిగిన తేజాస్ ఎక్స్‌ప్రెస్ 78 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుందని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి రైళ్లను నడపాలా వద్దా అనేది ఈ రైళ్ల ఫలితాన్ని బట్టి తెలుస్తుందని చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications