హైదరాబాద్: చైనీస్ ప్రీమియం మొబైల్ ఫోన్ మేకింగ్ దిగ్గజం వన్‌ప్లస్ హైదరాబాదులో పరిశోధన, అభివృద్ధి (R&D) కేంద్రాన్ని నెలకొల్పింది. నానక్‌రామ్‌గూడలో 1,86,000 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన దీనిని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. అత్యున్నత మౌలిక వసతులు, మెరుగైన మానవ వనరులు, పురోగమన విధానాలతో నగరంలోని కంపెనీలు అత్యుత్తమ సేవలు అందించవచ్చునని కేటీఆర్ పేర్కొన్నారు.

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ తయారీ కేంద్రంగా...
వన్ ప్లస్ సంస్థ తమ కీలక కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. భాగ్యనగరం కేంద్రంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్‌ను తయారు చేయాలని ఆకాంక్షించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ దోశ, బిర్యానీ బాగుంటుందని ఈ సందర్భంగా చెప్పారు.

త్వరలో హైదరాబాద్ వన్‌ప్లస్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్ తమకు ఎంతో కీలకమైన ప్రాంతమని, దేశంలో తమకు స్వాగతం పలికిన తీరు, ఇక్కడ దక్కిన ఆదరణ సంతోషాన్ని ఇచ్చిందని వన్‌ప్లస్ వ్యవస్థాపకులు పీట్ లావ్ అన్నారు. హైదరాబాద్ భారత ఐటీ రంగ హబ్‌గా ఎదుగుతోందని, తమ R&D కేంద్రం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. మేకిన్ ఇండియాకు అనుగుణంగా ఉంటుందని, అలాగే దేశీయ, విదేశీయ అవసరాలు తీర్చేలా ఈ స్టోర్ ఉంటుందని చెప్పారు. 5G టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, AI రంగాల్లో కేంద్రం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. త్వరలో కొత్త ఉద్యోగుల్ని నియమించుకుంటామన్నారు. ప్రస్తుతం 200 మంది నిపుణులు ఉన్నారని, మూడేళ్లలో 1500 మంది ఉద్యోగులకు చేరుతుందన్నారు.

రూ.1000 కోట్లు ఇన్వెస్ట్, ఇక్కడి నుంచి మొబైల్ ఎగుమతులు
అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ అభివృద్ధి చేస్తామని పీట్ లావ్ అన్నారు. కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్ అండ్ నెట్ వర్కింగ్ ల్యాబ్, ఆటోమేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కెమెరా ల్యాబ్‌కు రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, మూడేళ్లలో కంపెనీకి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద R&D కేంద్రంగా అవతరిస్తుందన్నారు. ఈ మూడేళ్ల కాలంలో రూ.1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వన్ ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ చెప్పారు. ఆవిష్కరణల విషయంలో భాగ్యనగరాన్ని ప్రపంచపటంలో నిలుపుతామని చెప్పారు. ఈ ఏడాదే భారత్ నుంచి విదేశాలకు మొబైల్ ఫోన్స్ ఎగుమతి చేస్తామన్నారు.

భారత్ వాటాతో అగ్రస్థానం
ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ రంగంలో ప్రపంచంలో రెండు శాతం వాటాతో తొలి ఐదు స్థానాల్లో ఉన్నామని, భారత్‌లో 43% వాటాతో అగ్రస్థాయిని కైవసం చేసుకున్నామన్నారు. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్ నగర్‌లో నిర్మిస్తున్న అతి పెద్ద ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను అక్టోబరు-డిసెంబరు మధ్య ప్రారంభిస్తామన్నారు. భారతీయ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్లలో జెన్ మోడ్, ఎస్సెమ్మెస్ ఇన్ బాక్స్ లాంటి ఫీచర్స్ తీసుకు వస్తామన్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications