For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మారుతీ సుజుకీలో 3,000 ఉద్యోగాలు కట్

|

ఆటో పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర మందగమనంలో ఉందని, 2021 నాటికి కంపెనీ వృద్ధి తిరిగి పుంజుకోవచ్చునని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్తులో కారు సేల్స్ పెరగాలని ఆకాంక్షించారు. అప్పుడు 2021 నాటికి కంపెనీ సాధారణ వృద్ధి రేటుకు తిరిగి వస్తుందన్నారు. ఆయన మంగళవారం కంపెనీ ఏజీఎంలో షేర్ హోల్డర్స్ సమావేశంలో మాట్లాడారు.

<strong>ఒక్కరోజులో 2.41 లక్షల కోట్లు పెరిగిన సంపద, కారణాలివే...</strong>ఒక్కరోజులో 2.41 లక్షల కోట్లు పెరిగిన సంపద, కారణాలివే...

ఆటో మందగమన కారణాలివే...

ఆటో మందగమన కారణాలివే...

కొత్త సేఫ్టీ నిబంధనలు, BS VI, ఇన్సురెన్స్ ఖర్చులు పెరగడం, రోడ్ ట్యాక్స్‌లు వంటి వాటి కారణంగా వాహనం యొక్క ఖర్చు పెరుగుతుందని, మందగమనానికి ఇది కూడా కారణమని ఆయన తెలిపారు. గత ఏడాది రెండో భాగంలో మందగమనం కారణంగా కంపెనీ రెండంకెల వృద్ధి రేటుకు చేరుకోలేకపోయిందన్నారు. మార్కెట్ షేర్ అలాగే ఉన్నదని, కానీ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 2.9 శాతం తగ్గిందన్నారు.

అప్పుడే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్..

అప్పుడే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్..

రోడ్ ట్యాక్స్ పెంచిన తొమ్మిది రాష్ట్రాలలో కార్ల అమ్మకాలు తగ్గిపోయాయని ఆయన చెప్పారు. పెట్టుబడులు ప్రోత్సహించేందుకు, కాంపిటీటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సాహం కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. 2022 నాటికి జీడీపీ వృద్ధిరేటులో ఆటో ఇండస్ట్రీ వృద్ధి 25 శాతంగా ఉండాలంటే మరిన్ని చర్యలు చేపట్టాలన్నారు. అఫ్పుడే ప్రధాని నరేంద్ర మోడీ కోరుకున్నట్లుగా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్ నిలుస్తుందన్నారు.

3,000 మంది ఉద్యోగులు ఔట్

3,000 మంది ఉద్యోగులు ఔట్

మారుతీ సుజుకీ మరోసారి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని భార్గవ తెలిపారు. కంపెనీలోని 3,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందాల్ని పొడిగించలేదన్నారు. మార్కెట్లో కార్లకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

సీఎన్జీ కార్ల ఉత్పత్తి పెంపు

సీఎన్జీ కార్ల ఉత్పత్తి పెంపు

ఇదిలా ఉండగా, బీఎస్-6 నిబంధనల్ని అందుకునేందుకు మారుతీ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అలాగే సీఎన్జీ, హైబ్రీడ్ కార్ల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. ఈ ఏడాది సీఎన్జీ కార్ల ఉత్పత్తిని 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

English summary

మారుతీ సుజుకీలో 3,000 ఉద్యోగాలు కట్ | Maruti Suzuki cuts 3,000 contract jobs

Maruti Suzuki Chairman R.C. Bhargava has said that the industry is near the bottom of the downward cycle and the company should return to usual growth rate in 2021.
Story first published: Tuesday, August 27, 2019, 16:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X